Big Stories

Musk is afraid of bankruptcy : దివాళా భయంతో మస్క్..

Musk is afraid of bankruptcy : 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్ ను కొన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్… ఆ సంస్థ దివాళా తీస్తుందేమోనని భయపడుతున్నాడా? అంటే… ఔననే సమాధానమే వినిపిస్తోంది. ట్విట్టర్ ఉద్యోగులతో సమావేశమైన మస్క్… కఠిన పొదుపు చర్యలు తీసుకుని, కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించకపోతే… సంస్థ దివాళా తీసి తీరుతుందని హెచ్చరించాడు. దాంతో… ఆ భయంతోనే మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడేమోననే చర్చ జరుగుతోంది.

- Advertisement -

డబ్బులెవరికీ ఊరికే రావు… తెలుగునాట ఫేమస్ అయిన ఈ డైలాగునే కాస్త అటూ ఇటూ మార్చి మస్క్ తన ఉద్యోగులతోనూ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. లక్షల కోట్లు పోసి ట్విట్టర్ కొన్నానని… తాను ఏది చెబితే అది చేయాలంటూ సిబ్బందికి మస్క్ ఆదేశాలు జారీ చేశాడని అంటున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారానికి 80 గంటలు పని చేయాల్సిందేనని… వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా రద్దు చేస్తున్నానని మస్క్ ట్విట్టర్ ఎంప్లాయిస్ తో అన్నాడు. అంతేకాదు… ఉచితంగా ఆహార పదార్థాలు ఇవ్వడం, పనితీరు ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాలు తగ్గించడం వంటి చర్యలు మొదలవుతాయని… ఇష్టం ఉన్న వాళ్లు ఉండొచ్చు… లేనివాళ్లు రాజీనామా ఇచ్చి వెళ్లిపోవచ్చు అని మస్క్ కఠినంగా హెచ్చరించాడని చెబుతున్నారు. దివాళా నుంచి బయటపడాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదనే మస్క్ ఇలా చేస్తున్నాడని అంటున్నారు.

- Advertisement -

ఓవైపు వేల మంది ఉద్యోగుల్ని తొలగించి… మరోవైపు ఉన్నవాళ్లు కూడా ఉంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్లిపోవచ్చు అని చెబుతున్న మస్క్… ఒకరిద్దరు ఉద్యోగుల విషయంలో మాత్రం రాజీనామాకు ఒప్పుకోలేదని సమాచారం. ట్విట్టర్‌ సేఫ్టీ & ఇంటెగ్రిటీ గ్లోబల్ హెడ్ యోయెల్ రోత్, సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ రాబిన్ వీలర్ కూడా ట్విటర్‌కు రాజీనామా చేశారని… కానీ మస్క్ వాటిని తిరస్కరించి ఇద్దరూ సంస్థలోనే కొనసాగాలని మస్క్ పట్టుబట్టారని చెబుతున్నారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను కాపాడుకోవడానికే మస్క్ ఆ ఇద్దరి రాజీనామాలకు ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి… అనవసరంగా ట్విట్టర్ పిట్టను నెత్తిన పెట్టుకున్నాడనే అపవాదు ఎదుర్కొంటున్న మస్క్… దివాళా భయంతో ఉద్యోగులను ప్రతీక్షణం వణికిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News