IND vs ENG 4th Test : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్టు మధ్య ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కీలక ఆటగాడు రిషబ్ పంత్ ఆడినంత సేపు భారత జట్టు స్కోరు పరుగులు పెట్టింది. రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్ కావడంతో భారత బ్యాటర్లు అంతా రఫా రఫా ఔట్ అయ్యారు. రిషబ్ పంత్ తిరిగి ఎంట్రీ ఇచ్చిన తరువాత కాస్త స్కోర్ బోర్డు పరుగులు పెట్టినప్పటికీ.. ఇవాళ ఆర్చర్ వేసిన బంతి ఫోర్ పోతుందని రన్ తీయలేదు పంత్.. ఇక ఆ తరువాత ఆర్చర్ అద్భుతమైన బంతి వేయడంతో రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. వికెట్ ఎగిరి పిచ్ లో గుచ్చుకోవడం విశేషం. రిషబ్ పంత్ ఔట్ అయ్యాక బుమ్రా, సిరాజ్ కలిసి 9 పరుగులు చేశారు. 349 పరుగుల వద్ద రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు.
Also Read : Abhimanyu Easwaran: 37 సెంచరీలు, 12 వేల రన్స్… కానీ టీమిండియాలో ఛాన్స్ రావడంలేదు… దరిద్రం అంటే ఇతనిదే !
టీమిండియా 358 పరుగులకు ఆలౌట్
దీంతో టీమిండియా నాలుగో లెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగులు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (61), జైస్వాల్ (58) , రాహుల్ (46) శార్దూల్ ఠాకూర్ (41) రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లతో తన సత్తా చాటారు. ముఖ్యంగా మాంచెస్టర్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగాడు పంత్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. 67 ఇన్నింగ్స్ లో 2719 పరుగులు చేశాడు. ఈ రికార్డు ఇంతకు ముందు టీమిండియా టెస్ట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 69 ఇన్నింగ్స్ లో 2716 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన పంత్
తాజాగా రిషబ్ పంత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. తొలిరోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ అయిన పంత్.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్ కి చేరాడు. బొటన వేలు గాయంతో బాదపడుతూనే పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్ వీరోచిత పోరాటానికి అందరూ సలాం కొడుతున్నారు. పంత్ హాఫ్ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికి హైలేట్ గా నిలిచింది. ఈ సిక్సర్ తో పంత్ భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేందర సెహ్వాగ్ రికార్డును సమం చేసాడు. ప్రస్తుతం పంత్, సెహ్వాగ్ టెస్టుల్లో 90 సిక్సర్లతో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి గానే పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔట్ అయ్యాక భారత్ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌట్ అయింది.
Most sixes for India in Tests
90* – Rishabh Pant
90- Virender Sehwag
88- Rohit Sharma
78-MS Dhoni
74- Ravindra Jadeja#Rishabpant #ENGvsIND pic.twitter.com/ZuzIuJlxJl— Shivam18 (@ShivamChau18186) July 24, 2025