E-Paper
Advertisement

సాయి దుర్గ తేజ్ ‘ సంబరాల ఏటి గట్టు ‘ రిలీజ్ డేట్ లాక్.. పోటీ తప్పదా..?

సాయి దుర్గ తేజ్ ‘ సంబరాల ఏటి గట్టు ‘ రిలీజ్ డేట్ లాక్.. పోటీ తప్పదా..?
Advertisement

Sai Durga Tej : టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ వస్తున్నాడు.. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలలో ఎక్కువగా నటించిన ఈ హీరో ఇప్పుడు యాక్షన్ జానెర్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమాతో ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఇండియాన్ షేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు.. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎప్పుడు సినిమా రిలీజ్ కాబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

సంక్రాంతి బరిలో ‘ సంబరాల ఏటిగట్టు ‘..

సంక్రాంతి పండుగ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సినిమాలు చాలావరకు సంక్రాంతికి రిలీజ్ అవుతుంటాయి.. ఇప్పటివరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా.. మంచి కలెక్షన్స్ కూడా సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సినిమా కూడా చేరింది.. 2027 సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేసేందుకు జనవరి 12వ తేదీని పరిశీలిస్తున్నారని ఫిలిమ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విషయానికోస్తే..

Advertisement

సాయి దుర్గ తేజ్ విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం లాంటి కామెడీ లవ్ ఎంటర్ అయిన చిత్రాలతో పాటుగా, వీరుపాక్ష లాంటి సూపర్ హిట్ యాక్షన్ స్టోరీ తో జనాలను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు మళ్లీ సరికొత్త స్టోరీ తో ‘సంబరాలు ఏటిగట్టు ‘అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారీగా కండలు తిరిగిన వీరుడు లాగా కనిపిస్తున్న సాయి దుర్గ తేజ్ ఈ మూవీతో మరోసారి హిట్ నీ తన ఖాతాలో వేసుకుంటాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మూవీ తో నిజంగానే ఆయన జాతకం పూర్తిగా మారిపోతుంది అని మెగా అభిమానులు సంతోషంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇందులో సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడిపోతుంది. ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందా అన్నది చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం బాధపడ్డ రోహిణి.. మనోజ్ దెబ్బకు కానిస్టేబుల్ షాక్.. బాలు ఎంతైనా గ్రేట్ అబ్బా..

Tags

Related News

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?

ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

ఐదేళ్ల తరువాత కూడా నిలబడే ఉన్నాను..చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగా హీరో!

సందీప్ మాటలను నిజం చేయాలనిపిస్తోంది – ఫరియా అబ్దుల్లా

‘ప్యారడైజ్’ ఎక్కడ తేడా కొట్టిందో తెలుసా?

నూతన బాధ్యతలు చేపట్టిన మెగా కోడలు ఉపాసన!

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

Big Stories

Advertisement
×