Plane Crashed: ప్రపంచంలో ప్రమాదాల తీవ్రత అమాంతంగా పెరిగింది. బస్సులు, రైళ్లు, చివరకు విమానాలు ప్రమాదాల ఘటనలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా సైనిక విమానం కూలిన ఘటనలో దాదాపు 32 మంది మృతి చెందారు. ఈ ఘటన నైజీరియాలో వెలుగు చూసింది. అసలు ఘటన ఎలా జరిగింది?
నైజీరియా ఆర్థిక రాజధారి లాగోస్‌కు సమీపంలోని ఇగ్బోకోడా నదీతీర పట్టణంలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ప్రమాదం సమయంలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి విమానం గుర్తు పట్టలేనంతగా ముక్కలు అయ్యింది. ఈ ఘటన గురించి తెలియగానే ఆ ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకుని గాలింపు చేపట్టాయి. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది.
అధ్యక్షుడు బోలా టినుబు ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేశారు. నైజీరియాకు చెందిన వైమానిక విమానం, ATR-42గా గుర్తించారు. వైమానిక విమానం బెనిన్ నుండి లాగోస్‌కు వెళ్తుండగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.13 గంటలకు విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత అతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు తెగిపోయాయి. చివరకు ఓ వైమానిక స్థావరం వద్ద కూలినట్టు ఆ దేశ మీడియా చెబుతోంది.
విమానం నది సమీపంలో కూలిపోయిందని, దానిలోని కొంత భాగం నీటిలో మునిగిపోతోందని స్థానికులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇగ్బోకోడాలోని నావికా స్థావరానికి సమీపంలో శిథిలాలను గుర్తించారు. ఈ ఘటనలో మరణించిన 32 మంది కుటుంబాలకు నైజీరియా వైమానిక దళానికి అధ్యక్షుడు టినుబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ALSO READ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!
మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు అధ్యక్షుడు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని వైమానిక దళాన్ని ఆదేశించినట్టు తెలిపారు.
కూలిన సైనిక విమానం.. 32 మంది మృతి
బెనిన్ నుంచి లాగోస్ వెళ్తున్న నైజీరియా ఎయిర్ ఫోర్స్ ATR-42 విమానం ఒండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 మంది మరణించినట్లు సమాచారం.#Nigeria #PlaneCrash #bigtv #NigeriaNews pic.twitter.com/6r0OruryZp
— BIG TV Breaking News (@bigtvtelugu) October 6, 2026