BigTV English

OTT Movie : అసలే బట్టతల, ఆపై ఆ సమస్య… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : అసలే బట్టతల, ఆపై ఆ సమస్య… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : ఈ మధ్యకాలంలో ఓటీటీలో మలయాళం సినిమాల హడావిడి నడుస్తోంది. ఈ సినిమాలు మంచి కంటెంట్ తో స్క్రీన్ ముందుకు రావడంతో మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓ సినిమా సందడి చేసి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీ లలో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక మలయాళం మూవీ. బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నా గాని తనకు బట్టతల ఉండటంతో ఆ అబ్బాయికి పెళ్లి కాకపోవడంవలన పెళ్లి కోసం అతడు చేసే ప్రయత్నాలతో మూవీ చాలా సరదాగా నడుస్తుంది. ఈ మూవీ పేరు “విశేషం” (Vishesham). ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video), సింప్లీ సౌత్ (simply south) ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఈ మూవీలో హీరో పేరు సిజు. తన కుటుంబంతో హ్యాపీగానే జీవితం సాగిస్తుంటాడు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాగాని అతనికి బట్ట తల ఉండటంతో అతనిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నిరాకరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అతనికి పెళ్లి చేయగా, ఆ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతుంది. సిజుకి ఇలా జరిగిందని అతని తో పాటు అతని  ఫ్యామిలీ కూడా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఇతనికి మళ్లీ పెళ్లి చేయాలని అతని అన్న ప్రయత్నాలు మొదలు పెడతాడు. చాలా మందిని చూస్తారు కాని ఎవ్వరూ సెట్ అవ్వరు. సిజు మాదిరిగా పెళ్లి చేసుకొని విడిపోయిన మరొక అమ్మాయిని చూస్తే, ఇతనికి పెళ్లి సెట్ చెయ్యచ్చు అనుకొని,  సిజుకి  అటువంటి సంబంధాలు చూస్తాడు అతని ఆన్న. సుజిని ఒక ధర్నాలో అనుకోకుండా ఒక లేడీ కానిస్టేబుల్ లాఠీతో కొడుతుంది.

ఆ తర్వాత ఆ లేడీ కానిస్టేబుల్ కూడా పెళ్లి ప్రయత్నాలలో ఉంటుంది. కొద్ది రోజుల తరువాత ఇద్దరికీ పెళ్లి కుదురుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ సంసారంలో పిల్లలు పుట్టకపోవడం వలన అనుకోని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏమిటి? పిల్లలు కలగడానికి వీళ్ళు చేసే ప్రయత్నం ఏమిటి? చివరి వరకు ఈ జంట కలిసి ఉంటారా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), సింప్లీ సౌత్ (simply south)లో స్ట్రీమింగ్ అవుతున్న “విశేషం” (Vishesham) మూవీ ని తప్పకుండా చూడండి. ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేశారు మేకర్స్. మూవీ చూస్తున్నంత సేపు చాలా సరదాగా ఉంటుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీని చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. మరెందుకు ఆలస్యం మూవీ లవర్స్ ఈ మూవీ పై ఓ లుక్కేయండి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×