E-Paper
Advertisement

Share market today : ఈవారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది.. ప్రభావం చూపే అంశాలేంటి?

Share market today : ఈవారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది.. ప్రభావం చూపే అంశాలేంటి?
Advertisement
Share market today

Share market today : దలాల్ స్ట్రీట్ జోరు మీద ఉంది. ప్రధాన సూచీలు గత మూడు వారాలుగా అప్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ క్యూస్, ఎఫ్ఐఐల పెట్టుబడులతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందిస్తోంది. అయితే, ఐటీ స్టాక్స్ మాత్రం కాస్త ప్రెషర్‌లో ఉన్నాయి. ముఖ్యంగా టీసీఎస్ నాలుగో క్వార్టర్స్ రిజల్ట్స్ ఇంప్రెసివ్‌గా లేకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

ఈ వారం ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ కూడా బెటర్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ వారం మార్కెట్లను నడిపించేది కార్పొరేట్ రిజల్ట్సే. వచ్చే ఫలితాలను బట్టే మార్కెట్లు రేంజ్ బౌండ్‌లో ట్రేడ్ అవుతాయని చెబుతున్నారు.

Advertisement

ఇండియాపరంగా అయితే అన్నీ పాజిటివ్ న్యూసే ఉన్నాయి. కాకపోతే ఈ వారం 50 కంపెనీలు ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. అవే మార్కెట్‌ను లీడ్ చేయొచ్చు. ఇక సోమవారం రోజు హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ నంబర్స్ విడుదలవుతాయి. ధరలు అనుకున్న స్థాయిలోనే ఉంటే.. అవే మార్కెట్లకు మంచి సిగ్నల్స్ ఇవ్వొచ్చు.

ఇక ఈవారం చైనా జీడీపీ గణాంకాలు కూడా విడుదల కావాల్సి ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెంబర్స్ ఇవి. కఠిన కరోనా నిబంధనలు, రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా చైనా జీడీపీ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Advertisement

మంగళవారం రోజు అమెరికాలో ఇళ్ల కొనుగోళ్ల రిపోర్ట్, గురువారం రోజు నిరుద్యోగ డేటా, శుక్రవారం రోజు తయారీ, సేవా రంగాల నెంబర్స్ వస్తాయి. యూరో జోన్ నుంచి బుధవారం నాడు ద్రవ్యోల్బణ గణాంకాలు, జపాన్ పారిశ్రామిక ఉత్పత్తి వివరాలు వస్తాయి. సో, ఇవి కూడా మన మార్కెట్లపై ఎఫెక్ట్ చూపబోతున్నాయి.

ఇండియన్ మార్కెట్లకు అతి పెద్ద బూస్టప్ ఏంటంటే.. ఎఫ్ఐఐలు తిరిగి పెట్టుబడులు పెట్టడం. ఈ ట్రెండ్ ఈవారం కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

మంగళవారం నాడు అవలాన్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతోంది. ఇది అంత ఇంప్రెసివ్‌గా ఉండొచ్చనేది అంచనా. 

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×