Coffee Machines Under 15000: కాఫీ అంటే కేవలం ఓ పానీయం కాదు.. చాలామందికి రోజును ఉత్సాహంగా ప్రారంభించే ఎనర్జీ, సాయంత్రాన్ని ఆహ్లాదంగా మార్చే చిన్న ఆనందం. స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ నుంచి క్రీమీ లాతే, కాపుచినో వరకు.. ఒక్కొక్కరికీ ఒక్కో కాఫీ అంటే ఇష్టం. అలాంటి కేఫే స్టైల్ కాఫీని ఇంట్లోనే ఆస్వాదించాలంటే ఖరీదైన మెషిన్లే కొనాల్సిన అవసరం లేదు. రూ.15,000 లోపు బడ్జెట్‌లోనే మీకు నచ్చిన కాఫీని తయారు చేసుకునే ఆప్షన్లు ఉన్నాయి. అయితే, ఏ మెషిన్ మీకు సరిపోతుంది? ఏది మీ బడ్జెట్‌కు బెస్ట్‌గా ఉంటుంది? మీ అవసరాలను బట్టి ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న ఐదు కాఫీ మెషిన్లు, వాటి ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తక్కువ ధరలో లభించే ఈ మెషిన్ 20-బార్ పంప్ సిస్టమ్‌తో వస్తుంది. 1100 వాట్ల పవర్ ఉన్న ఈ డివైజ్ పాలను బాగా ఫ్రోథింగ్ చేయడానికి స్టీమ్ వాండ్‌ను కలిగి ఉంది. 1.5 లీటర్ల వాటర్ ట్యాంక్, సింగిల్ లేదా డబుల్ షాట్ కోసం సులువైన వన్-బటన్ కంట్రోల్స్ దీని సొంతం. రిమూవబుల్ డ్రిప్ ట్రే వల్ల క్లీనింగ్ చాలా సులభం అవుతుంది.
రూ.10,499 ధరలో లభించే ఈ 20-బార్ మెషిన్ మెటల్ పోర్టాఫిల్టర్, టెంపరేచర్ ఇండికేటర్‌తో వస్తుంది. కాఫీ, పాల నురగ ఉష్ణోగ్రతలను వేర్వేరుగా నియంత్రించడానికి ఇందులో రెండు థర్మోస్టాట్‌లు ఉన్నాయి. ఎస్ప్రెస్సో కూల్ ఫీచర్‌తో చల్లటి ఐస్డ్ కాఫీలను కూడా తయారుచేసుకోవచ్చు. బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది మంచి ఛాయిస్.
Also Read: గీజర్ కొనే ముందు ఈ ఫీచర్లు చూడకపోతే.. కరెంట్ బిల్లుతో పాటు గీజర్ కూడా త్వరగా పాడవుతుంది!
ఎల్లప్పుడూ ప్రయాణాల్లో ఉండే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్. మీ కార్ కప్ హోల్డర్‌లో సరిపోయే ఈ కాంపాక్ట్ డివైజ్, సొంతంగా నీటిని వేడి చేసి 20-బార్ ప్రెజర్‌ను అందిస్తుంది. ఇటు గ్రౌండ్ కాఫీ, అటు క్యాప్సూల్స్ రెండింటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. ఆఫీస్ డెస్క్ లేదా రోడ్ ట్రైప్స్‌లో మంచి కాఫీ తాగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
కాఫీ బీన్స్ నేరుగా గ్రైండ్ చేసుకుని ఫ్రెష్‌గా తాగాలనుకునే వారికి ఈ మెషిన్ పర్ఫెక్ట్. ఇందులో ఉండే డిజిటల్ మిల్ సహాయంతో బీన్స్‌ను కావాల్సిన రీతిలో నూరుకోవచ్చు. 1.5 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ మెషిన్ ఒకేసారి 12 కప్పుల డ్రిప్ కాఫీని ఇస్తుంది. ప్రశాంతమైన ఉదయాల కోసం క్వైట్ బ్రూ టెక్నాలజీ, 24 గంటల టైమర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కొద్దిగా మాన్యువల్‌గా, స్వయంగా కాఫీ షాట్ పుల్ చేయాలనుకునే కాఫీ లవర్స్ కోసం ఈ సెమీ-ఆటోమేటిక్ మెషిన్ బాగుంటుంది. 19-బార్ పంప్, ఇన్‌స్టంట్ హీట్ ఇచ్చే థర్మోబ్లాక్, స్టీమ్ వాండ్ దీని ప్రత్యేకతలు. నెస్‌ప్రెస్సో పాడ్స్, కాఫీ పౌడర్ రెండింటినీ వాడుకోవచ్చు. బ్రూయింగ్ టైమ్‌ను 10 నుండి 90 సెకన్ల వరకు సెట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
Also Read: గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా? One UI 9.0 అప్‌డేట్‌లో ఈ 5 ఫీచర్లు మాత్రం మిస్ కావద్దు!