OTT Movie : సామాన్యుడు తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి, షార్ట్ ఫిల్మ్ ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఎంతో మంది వీటి ద్వారా తమ టాలెంట్ చూపించుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్ హారర్ జానర్ లో తెరకెక్కింది. ఇందులో ఓ తల్లి, కొడుకు మధ్య జరిగే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (Youtube) లో
ఈ సైకలాజికల్ హారర్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘మిల్క్’ (Milk). 2018లో వచ్చిన ఈ సినిమాకి సంటియాగో మెంఘిని దర్శకత్వం వహించారు. ఇందులో అనానా రైడ్‌వాల్డ్ (తల్లి), కామెరాన్ బ్రోడ్యూర్ (కొడుకు), మాయ చార్లోట్ డోహెర్టీ నటించారు. ఈ మూవీ 1970, 80ల నాటి స్లో-బర్న్ హారర్ సినిమాల నుండి స్ఫూర్తి పొందింది. ఇది తల్లి,కొడుకు మధ్య జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇది SXSW, బ్రూక్లిన్ హారర్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫాంటాసియా ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఒక సైలెంట్ రాత్రిలో మొదలవుతుంది. ఒక టీనేజ్ బాలుడు నిద్రలేమితో బాధపడుతూ, ఒక గ్లాసు పాలు తాగడానికి కిచెన్‌లోకి వస్తాడు. అతను చెప్పులు లేకుండా, నిశ్శబ్దంగా కిచెన్‌లోకి నడుస్తాడు. అక్కడ అతని తల్లి కిటికీ వద్ద నిలబడి, చేతిలో వైన్ గ్లాసు పట్టుకుని ఉంటుంది. ఆమె ఎందుకనో ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఆమె మొహంలో రూపు రేఖలు విచిత్రంగా మారుతుంటాయి. ఈ బాలుడు ఆమెను గమనించి, మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మాట్లాడే మాటలు తేడాగా ఉంటాయి. ఆ పిల్లాడు ఆమె తల్లి ప్రవర్తన చూసి బాగా భయపడిపోతాడు. ఈ సమయంలో ఆ ఇంటిలోని ఒక గది నుండి, ఒక బిడ్డ ఏడుస్తున్నట్లు వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ పిల్లాడు ఈ శబ్దాల గురించి తల్లిని భయపడుతూనే అడుగుతాడు.
కానీ తల్లి అతన్ని గదిలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తుంది. ఆమె స్వరంలో కూడా ఒక రకమైన బెదిరింపు ఉంటుంది. ఆ తరువాత అతను పాలు తాగడానికి ప్రయత్నిస్తాడు. కానీ గ్లాసులోని పాలు రంగు మారినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ పిల్లాడు ఒక భయాంకరమైన ఆకారాన్ని చూస్తాడు. ఆ రూపం ఒక బిడ్డను చేతుల్లో పట్టుకుని భయంకరంగా ఉంటుంది. ఈ దృశ్యం ఆ బాలుడిని మరింత భయాందోళనకు గురిచేస్తుంది. అతను తన తల్లి మానసిక స్థితి గురించి అనుమానించడం ప్రారంభిస్తాడు. ఒక వైపు తల్లి వింత ప్రవర్తన, మరో వైపు భయపెట్టే వింత ఆకారాలతో, క్లైమాక్స్ అదిరిపోయే ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి ఆ పిల్లాడికి కనిపించేది నిజంగా దెయ్యాలా ? అతని తల్లి మానసిక పరిస్థితి కారణమా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : సైకలాజికల్ ట్రాప్ లో పడేసే మూవీ… క్రైమ్, కన్ఫ్యూజ్, మైండ్ గేమ్స్ ఉన్న మూవీ