OTT Movie : సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం అన్నది చాలా అరుదు. కానీ మనసుకు హత్తుకునే కథతో, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటే మాత్రం థియేటర్లలో కాకపోయినా ఓటీటీలో అయినా చూస్తారు. ఒకవేళ మీరు కూడా అలాంటి మూవీ కోసమే వెతుకుతుంటే ఈ మూవీ మీ కోసమే. ఇందులో ఏకంగా ఓ14 ఏళ్ల పాప ట్యూషన్ టీచర్ చేసే పాడు పనుల వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది ? అన్నది స్టోరీ. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు? ఫ్యామిలీ చూడదగ్గ విధంగా ఉంటుందా లేదా? అన్నది తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే…
కథ 14 ఏళ్ల బాలిక హనీ కోహ్లీ (అనుష్క సేన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె తన ట్యూషన్ టీచర్ అమన్ (సతీష్ భట్) చేత లైంగిక వేధింపులకు గురై, గర్భవతి అవుతుంది. ఈ షాకింగ్ సంఘటన హనీతో పాటు ఆమె కుటుంబాన్ని తీవ్ర భావోద్వేగ గందరగోళంలోకి నెట్టేస్తుంది. హనీ తన గర్భాన్ని తీసేయాలని నిర్ణయించుకుంటుంది, కానీ భారతదేశంలోని చట్టపరమైన వ్యవస్థలో అబార్షన్ హక్కు కోసం ఆమె న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ పోరాటంలో ఆమెకు ఆమె వకీలు (పూజా దర్గన్), డాక్టర్ రాహుల్ (అహ్మర్ హైదర్) సహాయం చేస్తారు. కానీ వారు సమాజం, అమన్ తండ్రి (తారీఖ్ ఖాన్) ఒత్తిడులు, అబార్షన్‌కు వ్యతిరేకమైన యాక్టివిస్టుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు.
ఈ వ్యతిరేకవాదులు గర్భంలోని శిశువు జీవన హక్కును హనీ శారీరక, మానసిక ఆరోగ్యం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. కోర్టులో హనీ తన గుండెలోని బాధను వ్యక్తం చేసే సన్నివేశం, ఒక టీనేజర్‌గా ఈ సంఘటనలను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో చెప్పే డైలాగ్, ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. చివరలో న్యాయమూర్తి (మీర్ సర్వార్) ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోయే ఒక శక్తివంతమైన క్షణంగా నిలుస్తుంది. ఇంతకీ కోర్టు ఆ అమ్మాయి విషయంలో ఎలాంటి తీర్పును ఇచ్చింది? 14 ఏళ్ల స్కూల్ కు వెళ్ళే పాప తనకు పుట్టబోయే పాప విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రెగ్నెంట్, అబార్షన్ మధ్యలో ఎదురైన సమస్యలను ఎలా ఫేస్ చేసింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవలసిన అంశం.
Read Also : స్కూల్ ను ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్ తో జలకాలాటలు… గుండెలదిరే ట్విస్ట్ ఇచ్చే సైకో
190కి పైగా దేశాలలో ట్రెండింగ్ లో
రహత్ కాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ క్రైమ్ డ్రామా-థ్రిల్లర్ ‘యామ్ ఐ నెక్స్ట్’ (Am I Next). 2023లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అనుష్క సేన్ (హనీ కోహ్లీ), నీలు డోగ్రా (హనీ తల్లి), పూజా దర్గన్ (వకీలు), తారీఖ్ ఖాన్, అహ్మర్ హైదర్ (డాక్టర్ రాహుల్), సతీష్ భట్ (అమన్), మీర్ సర్వార్ (న్యాయమూర్తి) ప్రధాన పాత్రలు పోషించారు. అయితే 85 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీకి సీరియస్ థీమ్, లైంగిక వేధింపుల చర్చ కారణంగా సెన్సార్ A రేటింగ్ ఇచ్చింది. ZEE5 OTT ప్లాట్‌ఫారమ్‌లో డైరెక్ట్ రిలీజ్ అయిన ఈ మూవీ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 190+ దేశాలలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.