BigTV English

Technology To Help Farmers: రైతులకు సాయంగా టెక్నాలజీ.. వాటిపైనే ఆధారం..

Technology To Help Farmers: రైతులకు సాయంగా టెక్నాలజీ.. వాటిపైనే ఆధారం..

Technology To Help Farmers : ప్రపంచం సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఎంతో ముందుకెళ్తోంది. ఊహించలేని అభివృద్ధిని సాధిస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీపి అభివృద్ధి చేసుకునే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ నడుస్తోంది. అయినా కూడా కొన్ని విషయాలు అనేవి ఏమీ మారలేదు. ఇప్పటికీ చాలావరకు దేశాల్లో రైతులు అనేవారు ఉన్నారు. వారు పండించే పంటలు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కానీ ఈ రైతులు కూడా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారని నిపుణులు చెప్తున్నారు.


టెక్నాలజీ అనేది ప్రతీ రంగానికి ఒక కొత్త ఊపునిచ్చింది. ఎక్కువగా కష్టపడకపోయినా మంచి ఫలితాలను అందించేలా చేసింది. అదే విధంగా రైతులకు కూడా టెక్నాలజీ వల్ల లాభాలు కలుగుతాయని వారు భావిస్తున్నారు. అది పూర్తిగా వారు అపోహ అని కూడా అనుకోలేము. ఒకప్పుడు పంట పండించాలంటే ఎక్కువగా మ్యాన్ పవర్ అవసరం వచ్చేది. శరీరానికి గాయాలు అవుతున్న పట్టించుకోకుండా కష్టపడినా.. రైతులకు తగిన న్యాయం జరిగేది కాదు.. కానీ ఇప్పుడు టెక్నాలజీ సాయంతో మ్యాన్ పవర్ అవసరం చాలావరకు తగ్గిపోయింది. అంతే కాకుండా లాభాలు కూడా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా చైనా లాంటి దేశాల్లో రైతులకు టెక్నాలజీ గురించి నేర్పించడానికి, వారిని ట్రెయిన్ చేయడానికి శాస్త్రవేత్తలే స్వయంగా రంగంలో దిగారు. చైనాలో ఏ ఒక్క రంగం కూడా వెనకబడి ఉండకూడదు అనే ఆలోచనతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాగే మరికొన్ని దేశాల్లో జరిగితే.. అక్కడి వ్యవసాయ రంగం కూడా ఎక్కడలేని అభివృద్ధిని సాధిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఏ పంట కోసం అయినా మ్యాన్ పవర్ మీద పూర్తిగా ఆధారపడకుండా ఉండేలాగా టెక్నాలజీలు, పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి కాబట్టి రైతులకు వాటిపై అవగాహన ఉండడం మంచిదన్నారు.


అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య లాంటి దారులను ఎంచుకుంటున్న రైతులకు టెక్నాలజీ అనేది కొంతైనా ఊరటను ఇవ్వాలని నిపుణులు భావిస్తున్నారు. అయినా కూడా అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించిన విధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వినియోగించడం లేదని, దీనికోసం ప్రభుత్వాలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి దేశాల్లో కూడా రైతులకు సాయంగా టెక్నాలజీ నిలబడగలిగితే.. వారిని చాలా సాయంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×