BigTV English

History of Viagra : వయాగ్రా టాబ్లెట్ చరిత్ర ఇదే..! అలా మార్కెట్‌లోకి వచ్చిందా?

History of Viagra : వయాగ్రా టాబ్లెట్ చరిత్ర ఇదే..! అలా మార్కెట్‌లోకి వచ్చిందా?

Viagra : అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. నిజానికి వయాగ్రా పుట్టుక కూడా ఇలానే జరిగింది. మరో మందు కోసం ప్రయత్నిస్తుంటే.. మరోచోట రియాక్షన్ వచ్చింది. దీంతో పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫలితంగా అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి నోటి మాత్ర వయాగ్ర. ఫలితంగా 1998 లో అమెరికా, బ్రిటన్ దేశాల్లో మార్కెట్‌లోకి వచ్చి.. అమ్మకాల్లో చరిత్ర సృష్టించింది.


బ్రిటన్‌లోని సౌత్ వేల్స్‌లో మెర్తిల్ ట్విట్ ఫిల్ అనే చిన్న పారిశ్రామిక పట్టణం ఉంది. వారంతా అక్కడున్న ఒక చిన్న ఉక్కు పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగించేవారు. కొన్ని కారణాల వల్ల పరిశ్రమ ఒక్కసారిగా మూత పడింది. ఫలితంగా కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. బాగా డబ్బు అవసరం ఉండటంతో ఏ పనికైనా సిద్ధమే అన్నట్లు ఉన్నారు అక్కడి కార్మికులు.

కనీసం రోజువారీ ఆహారం కూడా కష్టమైంది. ఈ సమయంలో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులే క్లినికల్ గినీ పిగ్స్‌గా మార్చేసింది. వారు అంగీకరించకుంటే వయాగ్రా పుట్టేదేకాదు. ప్రపంచాన్ని మార్చేసే ఒక మందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌లో తాము భాగమవుతున్నామన్న విషయం కూడా వారిలో ఎవరికీ తెలీదు.


ఫైజర్ సంస్థ 1990లో అధిక రక్తపోటుకు చెక్ పెట్టేందుకు సిల్డెనాఫిల్ యుకె-92,480 అనే ఒక కాంపౌండ్‌ను పరీక్షిస్తోంది. ఈ సమయంలో ఔషధాన్ని పరీక్షించడానికి స్థానిక యువకులను రిక్రూట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 1992లో ఔషధాన్ని పరీక్షించేందుకు పట్టణంలోని కార్మికులు అంగీకరించారు.

ఈ ట్రైయల్స్‌లో పాల్గొనడానికి వచ్చిన యువకులకు యుకె-92,480 పిల్‌ను రోజుకు మూడు సార్లు చొప్పున క్రమం తప్పకుండా పది రోజుల పాటు వేసుకోవాలని సూచించారు. అందుగాను వారికి కొంత డబ్బును చెల్లించారు. దీని వల్ల వారి కుటుంబానికి మూడు పూటల అన్నం దొరికింది. చలి కాచుకోడానికి బొగ్గు సంచులు కూడా ఇచ్చారు.

క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆ డ్రగ్ వల్ల యువకుల్లో అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్ కనిపించింది. ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల అంగస్తంభన మాములు కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇదే సమయంలో ఇంతకు ముందుకంటే అంగం ఎక్కువగా గడ్డిపడినట్లు తెలిపారు. ఈ సైడ్ ఎఫెక్ట్ ఫైజర్ సంస్థ పాలిట వరంగా మారింది.

ఈ సైడ్ ఎఫెక్ట్ గమనించిన ఫైజర్ సంస్థ.. అధిక రక్తపోటు సంబంధ అధ్యయనంతోపాటు నపుసకత్వంపై కూడా రీసెర్చ్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా 1994 ప్రాంతంలో స్వాంజీతో తమ తదుపరి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ముందు.. అంగస్తంభన సమస్యలు ఉన్న రోగులకు పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో భాగంగా యువకులను, వివాహితులను ఎంపిక చేసుకుంది. వారికి సెక్స్ వీడియోలు కూడా చూపించారు.

డ్రగ్ ప్రభావం గురించి పరిశీలించడానికి ట్రయల్స్‌లో పాల్గొన్న వారి పురుషాంగానికి ఒక పరికరం అమర్చారు. ఫైజర్ సంస్థకు స్వాంజీలో జరిగిన అధ్యయనంలో పాజిటివ్ ఫలితాలు కనిపించాయి. దీంతో వారి చేతిలో ఉన్న ఔషధం చరిత్ర సృష్టించబోతుందని వారికి అర్థమైంది.

ఈ ఫలితాలు ఎంత పాజిటివ్‌గా ఉన్నాయంటే ట్రయల్స్‌లో పాల్గొన్న యువకులు కొందరు వారికి ఇచ్చిన టాబ్లెట్లను కంపెనీకి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.

ఇక ఈ డ్రగ్ అంగస్తంభన సమస్యకు చెక్ పెడుతుందని కన్ ఫాం చేసుకున్న ఫైజర్ సంస్థ.. టాబ్లెట్లను మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు మార్కెటింగ్ టీమ్‌ని రంగంలోకి దింపింది.

ఈ సమయంలో ఫైజర్ మార్కెటింగ్ హెడ్.. నపుంసకత్వం అనేది ఒక వ్యక్తిపై ఎంతటి ప్రభావం చూపిస్తుంది. వివాహ సంబంధాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందన్న విషయాలను గ్రహించారు. నపుంసకత్వానికి చెక్ పెట్టే విధంగా ఈ డ్రగ్ లైంగిక సంబంధాలను చక్కదిద్దగలదనే మేసేజ్‌ను మార్కెట్‌లోకి తీసుకెళ్లారు.

1998 మార్చి 27న మొట్టమొదటి అంగస్తంభన సమస్య టాబ్లెట్ అంటూ ఎఫ్.డీ.ఏ అప్రూవల్ పొందింది. అమెరికా, బ్రిటన్ మార్కెట్‌లోకి వయాగ్రా వచ్చింది. అలా రాగానే ఈ డ్రగ్ సంచలనం సృష్టించింది. 2008 కల్లా దాదాపు 200 కోట్ల డాలర్ల వార్షిక విక్రయాలతో ఫార్మా చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడు పోయిన డ్రగ్‌గా రికార్డుల కెక్కింది.

Tags

Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×