Big Stories

Red Moon : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం… ఎరుపెక్కనున్న చంద్రుడు

Red Moon : చంద్రుడంటే… చల్లదనం. వెన్నెల. చీకటి రాత్రిలో పిండి ఆరబోసినట్లు విరజిమ్మే వెలుగులు. అలాంటి చందమామ ముఖం ఎర్రగా మారబోతోంది. అదెప్పుడో తెలుసా నవంబర్ 8న. ఎందుకంటే ఆరోజు కార్తీక పౌర్ణమి. నిండు చందమామకు ఆ రోజు సాయంత్రం 5:32 గంటలకు గ్రహణం పట్టబోతోంది. సాయంత్రం 6:48 వరకు గ్రహణం వీడదు. అంటే దాదాపు 45 నిమిషాల 48 సెకండ్లపాటు చంద్రుడు ఎరుపువర్ణంలోనే కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అని, సంపూర్ణ చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఇక ఇది ఈ ఏడాది ఆఖరి చంద్రగ్రహణం. మళ్లీ బ్లడ్ మూన్ చూడాలంటే మరో మూడేళ్లు అంటే మార్చి 14, 2025 వరకు ఆగాల్సిందే. ఇదే విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది.
ఇంతకీ చంద్రగ్రహణం అంటే ఏంటి? చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే కక్ష్యలోకి వస్తాయి. అంటే చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి వస్తుంది. ఫలితంగా సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. దీంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. ఇదే చంద్రగ్రహణం.
ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది. మన దేశంలో కోల్ కతా, సిలిగురి, పాట్నా, రాంచి, గౌహతిలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. ఇక ఢిల్లీతోసహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే దర్శనం ఇవ్వనుంది. అటు ప్రపంచం విషయానికి వస్తే… నార్త్, ఈస్ట్ యూరోప్, ఏసియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పాసిఫిక్, అట్లాంటిక్, హిందూమహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో సంపూర్ణంగా అంటే చంద్రుడు అరుణ వర్ణంలో అగుపించనున్నాడు.
నవంబర్ 8న రాబోయే చంద్రగ్రహణంతో కలుపుకుంటే ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు వచ్చినట్లే. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఏప్రిల్ 30న సూర్యగ్రహణం, మే 16న చంద్రగ్రహణం, మొన్న దీపావళి అమావాస్య రోజున అంటే అక్టోబర్ 25న సూర్యగ్రహణాలు పట్టాయి. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 8న రాబోతున్న చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం ఉంటుంది. సూర్యగ్రహణం లాగే చంద్రగ్రహణాన్ని కూడా నేరుగా చూడకూడదంటున్నారు నిపుణులు. అలా చూస్తే కళ్లకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News