BigTV English

Hug Benefits : ఓమైగాడ్.. ఒక్క హగ్‌తో బోలెడు బెనిఫిట్స్..!

Hug Benefits : మనకు నచ్చిన వారిపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో తెలియజేస్తారు. ఈ క్రమంలో కొందరు మాటలు ద్వారా చెప్తే.. మరి కొందరు బహుమతి ద్వారా లేదా పూలను ఇచ్చి వ్యక్త పరుస్తుంటారు. అలానే హగ్ చేసుకుంటారు.అయితే ఈ విధంగా హగ్ చేసుకోవడం వలన ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hug Benefits : ఓమైగాడ్.. ఒక్క హగ్‌తో బోలెడు బెనిఫిట్స్..!

Hug Benefits : మనకు నచ్చిన వారిపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో తెలియజేస్తారు. ఈ క్రమంలో కొందరు మాటలు ద్వారా చెప్తే.. మరి కొందరు బహుమతి ద్వారా లేదా పూలను ఇచ్చి వ్యక్త పరుస్తుంటారు. అలానే హగ్ చేసుకుంటారు. అయితే ఈ విధంగా హగ్ చేసుకోవడం వలన ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మనందరం బాధ అయినా సంతోషమైనా మనకు ఇష్టమైన వారికి చెప్పుకునే సమయంలో హగ్ చేసుకుంటాం. ఈ విధంగా చేయడం వలన తమ బాధ నుంచి కొంత వరకు ఉపశమనం పొందుతారని తెలుస్తోంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు హగ్ కూడా ఉత్తమమైన పరిష్కారమని పలు అధ్యయనాల్లో తేలింది.

మీమల్ని బాధించే ఘటనలు జరిగినప్పుడు మీకు ప్రియమైన వారిని హగ్ చేసుకోండి. ఇలాంటి సమయంలో హగ్ చేసుకోవడం వల్ల ఒత్తడిని, ఆందోళన జయిస్తారు. హగ్ చేసుకున్నప్పుడు వెచ్చని స్పర్శ ద్వారా బాధ నుంచి బయటపడతారు. ఇది ఓదార్పు భావాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.


హగ్ అనేది ఒత్తిడి తగ్గించే ప్రభావాలను కలిగి ఉండటం వల్ల మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 400 మంది పెద్దలను ప్రతిరోజూ హగ్ చేసుకోవడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడింది. వారిలో రోగ నిరోధక శక్తి పెరిగింది.

ప్రేమించే వారిని హగ్ చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇష్టమైన వారిని 10 నిమిషాలు హగ్ చేసుకోవడం ద్వారా రక్తపోటు స్థాయిలు అదుపులోకి వస్తాయి. హృదయ స్పందనలు సాధారణ స్థితిలోకి వస్తాయి.

హగ్ చేసుకున్నప్పుడు కలిగే ఆనందంతో శరీరం నుంచి ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఈ రసాయనం శరీరంలోని బాధలను, ఒత్తిడిని తగ్గించి సంతోషంగా ఉంచుతుంది. స్త్రీలు తమ శిశువులను దగ్గరకు తీసుకున్నప్పుడు, వారికి ఇష్టమైన వారిని హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. పురుషులు మాత్రం వారికి నచ్చిన అమ్మాయి పక్కన కూర్చున్న, మాట్లాడినా లేదా తాకిన ఆక్సిటోసిన్ సాకుకూల ప్రభావాన్ని చూపుతుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×