BigTV English

Tips to Fall Asleep Quickly : తొంద‌ర‌గా నిద్ర పోవ‌డానికి చిట్కాలు

Tips to Fall Asleep Quickly : తొంద‌ర‌గా నిద్ర పోవ‌డానికి చిట్కాలు


Tips to Fall Asleep Quickly : మనిషికి ఆహారం, నీరుతో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం. కనీసం రోజుకు 7 నుంచి 8 గంటల పాటు పడుకోవాలని వైద్యులు చెబుతుంటారు. నిద్రలేమి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఎక్కువ దూరం ప్ర‌తిరోజు ప్ర‌యాణించేవాళ్లు, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడిపేవారు మరింత సమయం నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ చాలా మందికి మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా నిద్ర సరిగా పట్టక ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నిద్రించే సమయం.. నిద్రలేచే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే ముందు తేలికపాటి ఆహారం తీసుకోకూడదు. పగటి సమయంలో పడుకోవడం మానేయాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలను తాగాలి. సాయంత్రం యోగా, వాకింగ్‌తో పాటు కొన్ని వ్యాయామాలు చేయాలి. కొన్నిసార్లు నిద్రలేమి వెనుక స్థూలకాయం, దీర్ఘకాలిక నొప్పులు, హైపర్ యాక్టివ్ వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. మెల‌టోనిన్ హార్మోన్ మనల్ని సమయానికి నిద్రపోయేలా చేస్తుంది. అంతేకాకుండా నిద్రలేచేలా కూడా చేస్తుంది. తొక్క తీయని అరటిపండును, నీళ్లను, దాల్చిన చెక్క, షుగర్ ఫ్రీ చెక్కరను ఉపయోగించి నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. ముందుగా ఒక అరటి పండు తొక్క తీయకుండా శుభ్రంగా కడిగి చివర్లు తొలగించాలి. ఆ తర్వాత ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అరటిపండు ముక్కలను, దాల్చిన చెక్క పౌడర్ను వేసి మరిగించాలి. అలా మరిగిన తర్వాత వడకట్టుకోవాలి. దీనిలో తగినంత షుగర్ ఫ్రీ చెక్కలను కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి. ఇలా చేయడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. అలాగే ఐదు గ్రాముల జాజికాయ, ఐదు గ్రాముల మరాఠి మొగ్గ, ఐదు గ్రాములు జాపత్రి, మూడు పచ్చ కర్పూరం తీసుకొని పొడిగా చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో వీటిని ఒక పావు టీ స్పూను మోతాదులో కలుపుకొని తాగడం వల్ల నిద్రలేని సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఒత్తిడి ఆందోళన తగ్గి చక్కటి నిద్ర‌ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×