E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు – ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు – ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 19వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తిపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి.  ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.  సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.

వృషభం

Advertisement

ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనుల్లో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. 

మిథునం

మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి.  స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఋణ ఒత్తిడి వలన శిరోభాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కర్కాటకం

Advertisement

పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల  ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు  మందకొడిగా సాగుతాయి.

సింహం

శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.  బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. 

కన్య

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు  మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. ఉద్యోగమున బాధ్యతలు సరిగా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి.  వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు.

వృశ్చికం

శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.   కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

ధనుస్సు

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు.  సోదరుల నుండి ఊహించని ధన  సహాయం అందుతాయి.  

మకరం

ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించడం ముఖ్యం. గ్రహాల గమనం వల్ల ఈ రోజు మీకు అత్యంత శక్తివంతమైన రోజుగా ఉండవచ్చు. ఉద్యోగాలలో నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది.  ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

కుంభం

సామాజిక గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది.  మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

మీనం

వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి సంబంధిత పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×