BigTV English

Urine colors: మీ మూత్రం ఆ రంగులో ఉందా.. అయితే డేంజర్‌లో ఉన్నట్లే!

Urine colors:మన శరీంలోని వ్యర్థాలు మలమూత్రం, చెమటల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. అయితే మన ఆరోగ్యంగా ఏ రకంగా ఉంది. మనం ఏదైనా వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందా? అని వ్యర్థాలు ముందుగానే సంకేతాలు ఇస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా మూత్రం రంగు మారడం వల్ల వ్యాధుల బారిన పడతామెమో అని ఆందోళన చెందుతుంటారు.అయితే మనం తీసుకునే ఆహారం, కొన్ని రకాల ముందులు కూడా మూత్రం రంగుమారడానికి కారణం కావచ్చు. ఏ రంగు మూత్రం దేనిని సూచిస్తుందో, ఏది ప్రమాదకరమైన సంకేతమో చూద్దాం.

Urine colors: మీ మూత్రం ఆ రంగులో ఉందా.. అయితే డేంజర్‌లో ఉన్నట్లే!

Urine colors: మన శరీరంలోని వ్యర్థాలు మలమూత్రం, చెమటల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. అయితే మన ఆరోగ్యం ఏ రకంగా ఉంది. మనం ఏదైనా వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందా? అని వ్యర్థాలు ముందుగానే మనకు సంకేతాలు ఇస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా మూత్రం రంగు మారడం వల్ల వ్యాధుల బారిన పడతామేమో అని ఆందోళన చెందుతుంటారు. అయితే మనం తీసుకునే ఆహారం, కొన్ని రకాల ముందులు కూడా మూత్రం రంగుమారడానికి కారణం కావచ్చు. ఏ రంగు మూత్రం దేనిని సూచిస్తుందో, ఏది ప్రమాదకరమైన సంకేతమో చూద్దాం.


పింక్ లేదా ఎరుపు మూత్రం: ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి మూత్రంలో రక్తం లేదా హెమటూరియా వంటివి మూత్రం పింక్ లేదా ఎరుపు రంగులోకి మారడానికి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది మూత్రపిండాల వ్యాధి లేదా క్యాన్సర్ సంకేతం కావచ్చు. బీట్‌రూట్, బ్లాక్ బెర్రీస్, రబర్బ్ వంటి ఆహారాలు తిన్నా.. మూత్రం ఈ రంగులోకి మారొచ్చు.

తెలుపు లేదా పాల మూత్రం: చైల్రియా అనేది జీర్ణక్రియ సమయంలో తయారయ్యే పాలపదార్థం. ఇది ఉన్నప్పుడు మూత్రం ఈ రంగులోకి మారుతుంది. ఔషదాలతో దీనికి చికిత్స చేయవచ్చు.


నీలం లేదా ఆకుపచ్చ మూత్రం: ఫుడ్ కలర్‌ కలిగి ఉన్న ఆహారాలు తినడం వలన నీలం లేదా ఆకుపచ్చ రంగులో మూత్రం వస్తుంది. కొన్ని రకాల ఔషదాలు కూడా దీనికి కారణం కావచ్చు.

మేఘావృతమైన మూత్రం: ఈ రంగు గల మూత్రం UTIకి సంకేతం కావచ్చు. ఈ సందర్భంగా మూత్రం దుర్వాసన, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం, మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.

నారింజ రంగు మూత్రం: ఈ రంగు గల మూత్రం అంటే వ్యక్తి నిర్జలీకరణానికి గురయ్యాడని అర్థం. రైబోఫ్లావిక్ వంటి కొన్ని విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వలన కూడా మూత్రం ఈ రంగులోకి మారుతుంది.

ముదురు నారింజ లేదా గోధుమ రంగు మూత్రం: తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయకపోతే మదురు నారింజ లేదా గోధుమ రంగు మూత్రం రావచ్చు. తీవ్రమైన వ్యాయామం లేదా వేడి వాతావరణంలో ఉండటం వలన ఇలా జరుగుతుంది.

ముదురు గోధుమ లేదా నలుపు మూత్రం: ఈ రంగు మూత్రం కాలేయంలోని సమస్యకు సంకేతం కావచ్చు. లేదా ఏదైనా అంతర్లీన అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×