Big Stories

Chickenpox : అమ్మవారు వస్తే ఏం చేయాలి..?

Chicken Pox
Chicken Pox

Chickenpox : ఎండాకాలం వచ్చిందంటే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. వాటిల్లో చికెన్ ఫాక్స్ కూడా ఒకటి. దీన్నే అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఈ డిసీజ్ వల్ల ఒళ్లంతా ఎర్రని దద్దుర్లు వస్తాయి. శరీరం నీరసంగా మారుతుంది. ఎక్కువగా ఇది పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వైరస్ అనేది వేడి వాతావరణంలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి ఎండకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి, ఎండల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా రావచ్చు. చికెన్ పాక్స్ అనేది అంటు వ్యాధి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులభంగా సోకుతుంది. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది.

- Advertisement -

ఇక చికెన్ పాక్స్ వచ్చిన వ్యక్తిని ముట్టుకున్నా.. లేదా వారి వెంటున్నా కూడా వెంటనే మరొక వ్యక్తికి సోకుతుంది. ఈ వైరస్ గాలి ద్వారా కూడా ఈజీగా వ్యాపిస్తుంది. ఎండాకాలంలో చికెన్ పాక్స్ పిల్లలకు ఎక్కువగా వస్తుంది. కాబట్టి వైరస్ సోకిన వ్యక్తులు నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. లేదంటే ఈ వైరస్ వల్ల పిల్లలు మరణించే ప్రమాదం ఉంది.

- Advertisement -

Also Read : బీ కేర్ ఫుల్.. స్మార్ట్‌ఫోన్ పింకీ వస్తోంది!

గర్భిణీలు, పిల్లల్లో ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు ఈ వైరస్ బారిన పడితే పిండానిపై కూడా ఆ ప్రభావం ఉంటుందట. ఈ వ్యాధికి సరైన చికిత్స అందించకపోతే మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదటి 10-20 రోజుల్లో కాలేయం, ప్లీహంపై వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత శరీరం మొత్తం సోకుతుంది. రెండవ దశలో 24-48 గంటలు గడిచిన తర్వాత తీవ్రమైన ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం వంటి లక్షణాలు అధికమవుతాయి.

జ్వరం తీవ్రమైన తర్వాత ఛాతిపై ఎర్రటి పొక్కులు వస్తాయి. అలానే వీపుపై ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత ఇది మెల్లగా కాళ్లు, చేతులకు వ్యాపిస్తుంది. ఈ పొక్కులు క్రమంగా పెరుగుతూ నీటి బుడగల్లా మారుతాయి. తర్వాత వీటి మధ్యలో గుంట పడుతుంది. ఇది విపరీతమైన దురదను కలిగిస్తుంది. అలానే అమ్మవారు సోకడం వల్ల నోటి పూత, పేగులు పొక్కడం, అజీర్తి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్‌పాక్స్ ఎవరికైనా సోకితే సొంత వైద్యం మానుకొని, నిపుణులను సంప్రదించండి.

Also Read : మీరు నిమిషానికి ఎన్నిసార్లు కళ్లు ఆర్పుతున్నారు..?

చికెన్‌పాక్స్ వస్తే ఈ జాగ్రత్తలు పాటించండి

  • శరీరం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే చర్మం, పక్క బట్టలు కూడా క్లీన్‌గా ఉండాలి.
  • ఫీవర్‌కి పారాసెటమాల్ వైద్యులు సూచించిన మోతాదులో వాడాలి.
  • దురదకు కాలమైన్ లోషన్ రాసుకోవచ్చు.
  •  వైద్యుల సలహాపై యాంటీ హిస్టమిమ్ మందులు వాడవచ్చు.
  • పిల్లలు దురదలు తట్టుకోలేరు కాబట్టి గోకేసుకుంటారు. వారి గోర్లు కత్తిరించి.
  • పలుచని బట్ట చేతులకు చుట్టాలి.
  • సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
  • ఇంట్లో ఒకరికి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు.. ఇది వరకు ఈ వ్యాధి రానివారు రోగికి దూరంగా ఉండాలి.

Disclaimer : ఈ కథనాన్నిఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా అందిస్తున్నాం. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News