Big Stories

Sugar or Jaggery : చక్కెర కన్నా బెల్లం మంచిదా..?

Sugar or Jaggery
Sugar or Jaggery

Sugar or Jaggery : చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. చక్కెరను అధికంగా తీసుకుంటే బరువు పెరగడం దగ్గర నుంచి మరెన్నో సమస్యలు చట్టుముడతాయి. చాలా మంది ఈ మధ్య కాలంలో చక్కెరకు బయపడి వాడటం మానేశారు. దీనికి బదులుగా బెల్లం వాడుతున్నారు. సాధారణ చక్కెర కంటే బెల్లంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని కూడా చెరకు రసం నుంచే తయారు చేస్తారు. చెరకు రసం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అది చక్కెరగా మారే క్రమంలో అవిపోతాయి. అయితే నిజంగా ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో మనలో చాలా మందికి తెలియదు. దాని గురుంచి తెలుసుకుందాం.

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఫిట్నెస్‌పై ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. డయాబెటిస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. తీపిని తినాలంటే వెనకాడుతున్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో చక్కెరకు బదులుగా బెల్లం, తేనె వాడుతున్నారు. ఉదయాన్నే తాగే టీ నుంచి ఇంట్లో పండుగలకు చేసుకునే స్వీట్ల తయరీ వరకు బెల్లాన్నే ఉపయోగిస్తున్నారు.

- Advertisement -

Also Read : బీ కేర్ ఫుల్.. స్మార్ట్‌ఫోన్ పింకీ వస్తోంది!

చక్కెర,బెల్లానికి మధ్య తేడా..?

చక్కెర, బెల్లం రెండు కూడా చెరకు నుంచే తయారు చేస్తారన్న విషయం మనందరికి తెలిసిందే. కానీ వాటిని ప్రాసెస్ చేసే విధానం మాత్రం వేరుగా ఉంటుంది. తెల్లగా ఉండే చక్కెర అనేది రిఫైన్డ్ స్వీట్నర్. దీన్ని తయారు చేసే క్రమంలో ఇందులో సల్ఫర్ డై ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఫాస్పోరిక్ యాసిడ్ వంటి కెమికల్స్‌‌ను ఉపయోగిస్తారు. వీటివల్ల చెరకులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు,పోషకాలు పోతాయి. ఆకరికి కేలరీలు మాత్రమే అలానే ఉండిపోతాయి.

ఇక బెల్లం తయారీ విషయానికి వస్తే.. చెరకు రసాన్ని మరిగిస్తారు. అందులోని వాటర్ కంటెంట్ పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగిస్తారు. అది చిక్కగా అయ్యేంత వరకు ఉంచుతారు. ఆ తర్వాత పాకాన్ని అచ్చు పోస్తారు. దీన్ని రిఫైండ్ చేయరు కాబట్టి ఇందులో పోషకాలు ఉంటాయి. బెల్లంలో పోషకాలు సంమృద్ధిగా ఉంటాయి.

చక్కెర తిన్నప్పుడు ఏమవుతుంది?

చక్కెరను, దానితో చేసిన పదార్థాలను నేరుగా తినడం వల్ల అవి త్వరగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే చక్కెరలో ప్రోటీన్లు, ఖనిజాలు ఏమీ ఉండవు. అంతేకాకుండా జీర్ణంతో పాటుగా వేగంగా అవి రక్తంలో కలుస్తాయి. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. వెంటనే క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. రక్తంలో పెరుగుతున్న గ్లూకోజ్‌ను తీసుకోవాలని కణాలకు ఇన్సులిన్ చెబుతుంది. తీయగా ఉండే చాక్లెట్‌లు, బిస్కెట్లు తిన్నప్పుడు యాక్టివ్‌గా ఉండటానికి కారణం ఇదే.

Also Read : ఎండలో పనిచేస్తే గర్భం పోతుందా..?

బెల్లం తిన్నప్పుడు కూడా శరీరంలో ఇదే జరుగుతుంది. కాకపోతే బెల్లంలో ప్రోటీన్లు, మినరల్స్ ఉండటం వల్ల త్వరగా జీర్ణంకాదు. కాస్త టైమ్ పడుతుంది. అందువల్ల రక్తంలోని షుగర్ స్థాయిలు కాస్త నెమ్మదిగా పెరుగుతాయి. ఒక రోజులో బెల్లం, చక్కెర, తేనె వీటిలో ఏదైనా 20 నుంచి 36 గ్రాములకు మంచికుండా తినాలి. పురుషులు 9 టీ స్పూన్లు, మహిళలు 6 టీ స్పూన్లు మాత్రమే తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది.

Disclaimer: ఈ కథనాన్ని నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News