Aloe Vera: అలోవెరా శరీరానికి చాలా మేలు చేస్తుంది. అలోవెరా జెల్ ముఖ్యంగా చర్మానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలోవెరా జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే చాలా మందికి తరచుగా ముఖంపై మొటిమలు వస్తాయి.
మరి కొంత మంది ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు అలోవెరా జెల్ ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ముఖం అందంగా మెరుస్తూ కనిపించడానికి అలోవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది.
కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ , మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలోవెరా జెల్ చర్మానికి సహజసిద్ధమైన ఔషధం, ఇది అనేక చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది.
కలబంద యొక్క ప్రయోజనాలు:
వడదెబ్బ:
వేసవిలో వడదెబ్బ సమస్య సర్వసాధారణం. వేసవితో పాటు వర్షా కాలంలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఎండ వల్ల కలిగే చికాకు, ఎరుపును తగ్గించడానికి తరుచుగా ముఖంపై కలబంద జెల్‌ను రాయండి. దీంతో తక్షణ ఉపశమనం పొందవచ్చు.
మొటిమలు:
మీరు మొటిమలతో ఇబ్బంది పడుతుంటే, అలోవెరా జెల్ ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను దూరం చేస్తాయి. మొటిమల వల్ల ఏర్పడే వాపు, ఎరుపును తగ్గించడానికి మొటిమలపై కలబంద జెల్‌ను రాయండి.
చర్మపు చికాకు:
ఏ రకమైన చర్మపు చికాకుకైనా అలోవెరా జెల్‌ను ఉపయోగపడుతుంది. ఇది స్కిన్ బర్నింగ్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది:
అలోవెరా జెల్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా చేస్తుంది. దీన్ని మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. మీరు వారానికి రెండు, లేదా మూడు సార్లు అలోవెరా జెల్‌ను చర్మానికి అప్లై చేసుకోవచ్చు.
డార్క్ స్పాట్స్:
ముఖం మీద డార్క్ స్పాట్స్ వల్ల ఇబ్బంది పడే వారు అలోవెరా జెల్ ను ఉపయోగించాలి. అలోవెరా జెల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు డార్క్ స్పాట్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. తరుచుగా అలోవెరా ముఖానికి ఉపయోగించడం ద్వారా ముఖం అందంగా మారుతుంది.
జుట్టు కోసం:
అలోవెరా జెల్ జుట్టును బలంగా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గిస్తుంది. దీన్ని హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.
Also Read: పసుపుతో మొటిమలు లేని.. గ్లోయింగ్ స్కిన్
అలోవెరా జెల్ అప్లై చేసే విధానం..
చర్మాన్ని శుభ్రం చేయండి: అలోవెరా జెల్ అప్లై చేసే ముందు చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేయండి.
అలోవెరా జెల్‌ను అప్లై చేయండి: కలబంద జెల్‌ను ముఖంపై మొటిమలు ఉన్న ప్రాంతాలు ఉన్న చోట రాయాలి.
సున్నితంగా మసాజ్ చేయండి: జెల్‌ను సున్నితంగా ముఖంపై మసాజ్ చేయండి. తద్వారా ఇది చర్మంలోపలికి వెళ్తుంది.
ఆరనివ్వండి: జెల్‌ను కొంత సమయం పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత ముఖాన్ని కడిగేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.