EPAPER

Diet for Insomnia: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆహారం తింటే సుఖంగా నిద్ర పోతారు..

Diet for Insomnia: నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆహారం తింటే సుఖంగా నిద్ర పోతారు..

Diet for Insomnia Patients to get Sleep: ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర, సమతుల్య ఆహారం ఎంతో అవసరం. వీటిలో ఏ ఒక్కటి లోపించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుత్తాయి. అటువంటి పరిస్థితిలో.. ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నేడు చాలా మంది రాత్రిపూట పడుకునే సమయంలో స్మార్ట్ ఫోన్ చూడటం అలవాటైపోయింది. ఇది మన నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.


దీని కారణంగా మనం రాత్రిపూట నిద్రపోలేము. అయితే నిద్రలేమి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే ఇతర తీవ్రమైన శారీరక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్య నుండి బయట పడాలంటే కొన్ని ఆహారనియమాలు పాటించాలి. వాటిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. అయితే ఈ ఆహారాల పదార్ధాల గురించి తెలుసుకుందాం.

చెర్రీ..
చెర్రీస్ తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. టార్ట్ చెర్రీస్ తీసుకోవడం వల్లన నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ను ప్రోత్సహిస్తుంది.


Also Read: Horoscope: ఈ రోజు రాశి ఫలాలు..వీరికి ముట్టిందల్లా బంగారమే!

అరటిపండు..
అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్, విటమిన్ B6 శరీరంలోని సెరోటోనిన్, మెలటోనిన్‌లను ప్రోత్సహిస్తుంది. ఇది మన నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

బాదం..
బాదంపప్పులో మెలటోనిన్, మినరల్ మెగ్నీషియం వంటివి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్లన ఈ సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి ప్రతిరోజూ నిద్రవేళకు ముందు 5-6 బాదంపప్పులను తినండి.

ఓట్స్..
ఓట్స్‌లో అధిక మొత్తంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి. ఇంకా రాత్రంతా ప్రశాంతంగా నిద్రపట్టేలా ప్రోత్సహిస్తాయి.

Also Read: వర్షాకాలంలో వచ్చే చుండ్రు నివారణకు నేచురల్ రెమెడీస్ !

చమోమిలే టీ..
హెర్బల్ టీని చమోమిలే పువ్వుల నుండి తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న చమోమిలే టీని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలనుండి ఉపశమనం లభిస్తుంది. ఇవి నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి.

కొవ్వు చేప..
ప్రోటీన్-రిచ్ ఫ్యాటీ ఫిష్‌లో ఐరన్, జింక్, విటమిన్ బి12 ఇంకా కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సముద్రపు చేపలు, హిల్సా, ఆరెంజ్ రఫ్, ట్యూనా చేపలను తినడం వల్లన మంచి ఫలితం ఉంటుంది.

Related News

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Soya Chunks Manchurian: మిల్ మేకర్‌తో మంచూరియా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

Skin Care Tips: దీపావళి రోజు కొత్తగా కనిపించాలా ? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

Love Breakups: ముందు ప్రేమ.. ఆ తర్వాత ఇంకేముంది అదే.. పెరుగుతున్న లవ్ బ్రేకప్స్.. కారణం అదేనా?

Big Stories

×