Beerakaya Karam Podi: బీరకాయ, కాకరకాయను ఎక్కువ మంది తినటానికి ఇష్టపడరు. కానీ అవే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే రెసిపీలు కొన్ని చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము బీరకాయ కారంపొడి రెసిపీ ఇచ్చాము. మీకు నచ్చితే బీరకాయ పొట్టుతో దీన్ని తయారు చేయవచ్చు. బీరకాయ పొట్టుతో కారంపొడి తయారు చేస్తే అదిరిపోతుంది. ఎలా చేయాలో తెలుసుకోండి.
బీరకాయ కారం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
బీరకాయ పొట్టు – అరకిలో
ఎండుమిర్చి – 15
మినప్పప్పు – రెండు స్పూన్లు
పసుపు – అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది
చింతపండు – ఉసిరికాయ సైజులో
Also Read: కల్తీ నెయ్యిని గుర్తించండిలా ?
బీరకాయ కారంపొడి రెసిపీ
1. బీరకాయ కారం పొడిని బీరకాయ పొట్టుతో చేస్తే టేస్టీగా ఉంటుంది.
2. ఇందుకోసం మీరు బీరకాయ పొట్టును ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి.
3. బీరకాయ కొట్టిన శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. నీరు కలపాల్సిన అవసరం లేదు. అందులో ఉప్పు కూడా వేసి రుబ్బితే మంచిది.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఎండుమిర్చి వేసి వేయించాలి.
6. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మినప్పప్పును వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఆ మిగిలిన కళాయిలోని నూనెలో ముందుగా రుబ్బి పెట్టుకున్న బీరకాయ పొడిని వేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి.
8. అలాగే పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది పొడిగా తయారవుతుంది.
9. తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. ఇది చల్లారాక మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, వేయించిన బీరకాయ పౌడర్ వేసి బాగా కలుపుకొని మిక్సీ చేయాలి.
10. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. దీన్నిగాలి చొరబడని డబ్బాలో వేసి ఉంచితే నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది.
అన్నం తినేటప్పుడు రెండు ముద్దలు బీరకాయపొట్టు కారం పొడితో తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. బీరకాయ పొట్టులో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. సమస్యతో బాధపడుతున్న వారు బీరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది కాలేయానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య రాకుండా చూస్తుంది. గుండెను కాపాడుతుంది. అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. ఒంట్లో వేడి ఉత్పత్తిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీరకాయ తినడం వల్ల మనం శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.