Fennel Milk: సోపు కలిపిన పాలు త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తాయి. పీచు, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలు సోపులో పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్ ఎలిమెంట్స్ కూడా సోపు గింజలలో ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సోపును పాలల్లో కలిపి త్రాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది:
సోపు కలిపిన పాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కడుపులో గ్యాస్, అసిడిటీ , అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. రోజు ఒక గ్లాసు సోపు పాలు తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగి కడుపు తేలికగా ఉంటుంది.
మంచి నిద్రకు ఉపయోగపడుతుంది:
మీకు నిద్రలేమి ఉంటే, సోపు పాలు మీకు దివ్యౌషధం లాగా పని చేస్తుంది. నిద్రపోయే ముందు దీన్ని తాగడం వల్ల మెదడు రిలాక్స్‌గా మారి శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. సోపులో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా గాఢ నిద్రను కలిగించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
సోపు పాలు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది గొప్ప ఎంపిక.
నొప్పిని తగ్గిస్తుంది:
సోపు కలిపిన పాలు ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌లు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహకరిస్తాయి. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పిండం అభివృద్ధిలో కూడా సహాయపడుతుంది.
Also Read: వీటితో.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్
సోపు పాలు తయారు చేసే విధానం:
సోపు పాలు తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా సోపు వేసి తక్కువ మంట మీద ఉడికించాలి.తర్వాత పాలను వడకట్టి కొద్దిగా చల్లార్చి తేనె లేదా బెల్లం వేసి త్రాగాలి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.