BigTV English

Health Tips: బ్రెడ్, పీనట్ బటర్ తింటే ఇన్ని ప్రయోజనాలా ?

Health Tips: బ్రెడ్, పీనట్ బటర్ తింటే ఇన్ని ప్రయోజనాలా ?

Health Tips: చలికాలంలో శరీరానికి ఎక్కువ శక్తి, పోషణ అవసరమవుతుంది. శనగపిండి ఈ అవసరాన్ని తీర్చడంలో సహాయపడుతుంది.ఇదిలా ఉంటే పీనట్ బటర్ చాలా రుచికరమైనది మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీరు చలికాలంలో పీనట్ బటర్ తింటున్నట్లయితే దీని యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను మీరు అందుకుంటారు. శీతాకాలంలో పీనట్ బటర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


శరీరానికి ప్రొటీన్లు, క్యాలరీలను అందిస్తుంది:చలికాలంలో శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. పీనట్ బటర్ లో అధిక మొత్తంలో ప్రోటీన్, కేలరీలు ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఒక చిన్న చెంచాపీనట్ బటర్ ఉదయం పూట తింటే అది రోజంతా కడుపు నిండుగా ఉంచడమే కాకుండా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

జలుబు, దగ్గు నివారించవచ్చు:
చలికాలంలో వాతావరణంలో మార్పుల వల్ల ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు తరచుగా పెరుగుతాయి. పీనట్ బటర్ లో విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. తరుచుగా పీనట్ బటర్ తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థలను పెంచుతాయి. ఫలితంగా జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.


చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది :
చలికాలంలో చర్మం పొడిబారడం , పగుళ్లు ఏర్పడే సమస్య తరచుగా ఉంటుంది. పీనట్ బటర్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ చర్మానికి తేమను అందిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అలాగే చల్లని గాలుల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుంది:
శీతాకాలంలో, ఆకలి తరచుగా పెరుగుతుంది.దీంతో ప్రజలు స్నాక్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. పీనట్ బటర్ లో అధిక మొత్తంలో ప్రోటీన్,ఫైబర్ ఉన్నాయి. ఇది చాలా కాలం పాటు ఆకలిని దూరం చేస్తుంది. అంతే కాకుండా పీనట్ బటర్ సరైన మొత్తంలో తీసుకుంటే, అది అధిక కేలరీల తీసుకోవడం నివారించడంలో సహాయపడుతుంది . ఫలితంగా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

Also Read: చలికాలంలో తక్కువగా నీరు త్రాగుతున్నారా ? జాగ్రత్త

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పీనట్ బటర్ లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా మలబద్ధకం, అసిడిటీ, ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. చలికాలంలో జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పీనట్ బటర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగి కడుపు తేలికగా ఉంటుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×