Tips For White Hair: తెల్లజుట్టును ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే నెరిసిన జుట్టు మీ అందాన్ని పాడు చేయడంతో పాటు.. మీ వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిగా కనిపించేలా చేస్తుంది. నేటి కాలంలో పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరిలో నెరిసిన జుట్టు సమస్య కనిపించడం ప్రారంభించింది.
నెరిసిన జుట్టు సమస్యను పరిష్కరించడానికి ప్రజలు ఎక్కువగా రసాయనాలు కలిగిన హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు యొక్క బలం దెబ్బతింటుంది. అందుకే జుట్టు నెరసిపోవడాన్ని తొలగించే హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడాలి.
ఉసిరి :
ఉసిరి జుట్టు చికిత్సకు మంచి ఔషధం. తగిన మోతాదులో ఉసిరి ముక్కలను తీసుకుని కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత మీ జుట్టు, తలపై మసాజ్ చేయండి. జుట్టు వాష్ చేయడానికి ముందు కనీసం ఒక గంట లేదా రాత్రిపూట వదిలివేయండి. ఈ ప్రక్రియను కనీసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయండి.
ఎండు మిరియాలు:
తెల్లజుట్టు సమస్యను అధిగమించాలంటే ఎండు మిరియాలను నీళ్లలో మరిగించి మీ జుట్టు కడిగిన తర్వాత ఆ నీటిని తలపై పోయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఎండు మిరియాలు జుట్టును నల్లగా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి మీ జుట్టు, తలపై మసాజ్ చేయండి. మీ తలపై నూనె రాసుకున్న గంట తర్వాత మాత్రమే మీ జుట్టును కడగాలి. గ్రే హెయిర్ పెరుగుదలను నివారించడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది.
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం, బట్టతలని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఒక గాజు గిన్నెలో ఉల్లిపాయ, నిమ్మరసం కలపండి.తర్వాత దీనిని మీ జుట్టు, తలపై మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, తేలికపాటి హెర్బల్ షాంపూతో వాష్ చేయండి. ఉల్లిపాయ రసం చల్లగా ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో వాడితే బాగుంటుంది.
బాదం నూనె:
నిమ్మరసం, బాదం నూనెను సమాన పరిమాణంలో కలపండి. గ్రే హెయిర్ సమస్య ఉన్న వారు ఈ మిశ్రమంతో జుట్టుకు మసాజ్ చేయండి. అది క్రమంగా మీ జుట్టును నల్లగా మారుస్తుంది.అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా ఉపయోగపడుతుంది.
Also Read: వీటితో.. మొటిమలకు శాశ్వత పరిష్కారం !
హెన్నా వాడకం జుట్టును నల్లగా చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. గోరింట ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో మూడు చెంచాల ఉసిరి పొడి, ఒక చెంచా కాఫీ పొడి , ఒక చెంచా పెరుగు కలపండి. తర్వాత దీనిని జుట్టుకు అప్లై చేసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా తరుచుగా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.