BigTV English

Migraine: మిరియాలు ఇలా వాడితే.. క్షణాల్లోనే మైగ్రేన్ మాయం

Migraine: మిరియాలు ఇలా వాడితే.. క్షణాల్లోనే మైగ్రేన్ మాయం

Migraine: మైగ్రేన్ అనేది సంక్లిష్టమైన సమస్య. మైగ్రేన్ సమయంలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి, తల తిరగడం, వాంతులు వంటివి సర్వసాధారణం. చల్లని వాతావరణంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఇదిలా ఉంటే వంటగదిలోని నల్ల మిరియాలు మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి సులభమైన, సహజమైన పరిష్కారం. మైగ్రేన్‌ను తగ్గించడానికి మిరియాలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మైగ్రేన్ కేవలం తలనొప్పికే పరిమితం కాదు. ఇది మెడ, భుజాలు, వీపు వంటి శరీరంలోని ఇతర భాగాలలో కూడా నొప్పిని కలిగిస్తుంది. నరాలు కుదించబడినప్పుడు, విస్తరించినప్పుడు ఈ నొప్పి వస్తుంది. ప్రకాశవంతమైన కాంతి, శారీరక అలసట, మానసిక ఒత్తిడి మైగ్రేన్‌ను మరింత తీవ్రతరం చేస్తాయి.

నల్ల మిరియాలు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు , ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇది ఇది మైగ్రేన్ నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.


మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నల్ల మిరియాలు నమలడం ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల మిరియాల్లో ఉండే ‘పైపెరిన్’ అనే ఎంజైమ్ నరాలను ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా మైగ్రేన్ ప్రారంభ దశలోనే వీటిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా నల్ల మిరియాలు నమలడం వల్ల ఇందులోని పోషకాలు శరీరంలో అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.కానీ వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి.

మైగ్రేన్ తగ్గడానికి నల్ల మిరియాలు ఉపయోగించండి:

మైగ్రేన్ సమయంలో రెండు మూడు ఎండు మిరియాలను నెమ్మదిగా నమలండి.

అంతే కాకుండా వీటిని టీ లేదా గోరువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.

వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మైగ్రేన్‌ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

నల్ల మిరియాల్లో వేడిని కలిగిస్తాయి. కాబట్టి వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ముక్కు నుండి రక్తస్రావం లేదా ఇతర వేడి సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.

రోజు 2-3 నల్ల మిరియాలు కంటే ఎక్కువ తీసుకోవద్దు .

గర్భిణీ స్త్రీలు, పిల్లలు వైద్యుడి సలహా లేకుండా వీటిని తీసుకోకూడదు.

మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి హోం రెమెడీస్ అనుసరించడం మంచిది. నల్ల మిరియాలు మైగ్రేన్ తొలగించడానికి సమర్థవంతమైన ఎంపిక. కానీ వీటిని సమతుల్య పరిమాణంలో, సరైన పద్ధతిలో ఉపయోగించడం ముఖ్యం. దీంతో పాటు, మైగ్రేన్‌ను ప్రేరేపించే కారకాలను నివారించడం , సమయానికి నిపుణుల సలహా తీసుకోవడం కూడా అవసరం.

Also Read: సరిగ్గా నిద్రపోవడం లేదా ? జాగ్రత్త, ఈ వ్యాధుల బారి నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు

మిరియాలతో అద్భుతమైన ప్రయోజనాలు:

బరువు తగ్గడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
జ్వరం జలుబు నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మానికి మేలు చేస్తాయి.
నొప్పిని తగ్గిస్తాయి.
శరీరంలోని పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి.
మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
చర్మ వ్యాధులలో మేలు చేస్తాయి.

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×