Big Stories

Eye Cancer Symptoms : కళ్లు ఎర్రగా ఉన్నాయా? అయితే క్యాన్సర్ కావచ్చు!

Eye Cancer Symptoms : మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాల్లో కళ్లు ఒకటి. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం ఉంది. అయితే కొందరి కళ్లలో లేదా చుట్టూ ఉన్న కణాలలో చిన్న కణితలు ఏర్పడతాయి. ఆ ట్యామర్‌లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. కంటి చుట్టూ ఇది క్రమేపి పెరుగుతూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీనివల్ల కంటి క్యాన్సర్ వస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కంటి క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. కనుగుడ్డు లోపల వచ్చే క్యాన్సర్‌ను ఇంట్రాకోక్యులర్ క్యాన్సర్ అంటారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

Also Read : ఉపవాసం వల్ల షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయి..?

- Advertisement -

కంటి క్యాన్సర్ రకాలు

రెటినోబ్లాస్టోమా : ఇది పిల్లల్లో వచ్చే అత్యంత సాధారణ కంటి క్యాన్సర్.

మెలనోమా : ఇది కంటి లోపలి భాగంలో, ఐరిస్, సిలియరీ బాడీ లేదా కోరోయిడ్‌లో రావచ్చు.

లాక్రిమల్ గ్రంథి క్యాన్సర్ : కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథిలో ఈ క్యాన్సర్ వస్తుంది.

కంటి క్యాన్సర్ లక్షణాలు

  • దృష్టిలో మార్పులు.
  • అస్పష్టమైన లేదా చూపు తగ్గడం.
  • కంటిలో నల్ల మచ్చలు కనిపిస్తాయి.
  • రంగులు చూడడంలో ఇబ్బంది.
  • నిరంతర నొప్పి లేదా ఒత్తిడి.
  • కంటిలో ఏదో కుట్టినట్టు ఉండటం లేదా మంట.
  • తలనొప్పి
  • కళ్లలో ఎరుపు లేదా వాపు.
  • కంటి పరిమాణం లేదా రంగులో మార్పు.
  • కనురెప్పల మీద గడ్డలు లేదా గాయాలు.
  • కళ్ల నుండి నీరు కారడం.
  • శరీరం బరువు కోల్పోవడం.

రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాకుండా మీ ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోండి. పచ్చి కూరగాయలు, పండ్లు తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. పండ్లు, కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి.

Also Read : సమ్మర్.. ఈ చిట్కాలతో మీ జుట్టు సేఫ్!

బయటకు వెళ్లే ముందు సన్ గ్లాసెస్ ధరించండి. ఇది UVA, UVB కిరణాలు కంటిపై పడకుండా కాపాడుతుంది. టోపీని ధరించడం వల్ల కూడా సూర్యకిరణాల నుంచి కళ్లను రక్షించుకోవచ్చు. ఎండ అధికంగా ఉన్నప్పుడు నీడలో ఉండటానికి ప్రయత్నించండి. స్మోకింగ్ కంటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ అలవాటు ఉంటే పూర్తిగా మానుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News