Blackheads: ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ఉండటం అనేది ఒక సాధారణ సమస్య. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ సమస్యను ఎదుర్కొంటారు. బ్లాక్ హెడ్స్ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోయినప్పుడు, బ్లాక్ హెడ్స్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇలా వచ్చిన బ్లాక్ హెడ్స్ కొన్ని హోం రెమెడీస్‌తో తగ్గించుకోవచ్చు.
కొన్నిసార్లు శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల కూడా బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ వస్తాయి. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, కొన్ని హోం రెమెడీస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.
బ్లాక్ హెడ్స్ తొలగించే మార్గాలు:
శనగపిండి ,పెరుగు మాస్క్: శనగపిండి , పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముక్కుకు పట్టించాలి. ఇది మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
తేనె, దాల్చిన చెక్క మాస్క్: తేనె , దాల్చినచెక్కను కలిపి పేస్ట్‌లా చేసి ముక్కుపై అప్లై చేయండి. ఇది బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తరుచుగా వీటిని వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
ఓట్స్ , పెరుగు స్క్రబ్: ఓట్స్, పెరుగు మిక్స్ చేసి స్క్రబ్ లా తయారు చేసి, దానిని ముక్కుకు అప్లై చేయండి. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియంట్ గా పనిచేస్తుంది . వీటిని వాడటం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
అలోవెరా జెల్: అలోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తరుచుగా అలోవెరా జెల్ ముఖానికి పెట్టడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.
ఇవి కూడా ఉపయోగపడతాయి:
బ్లాక్ హెడ్ రిమూవల్ స్ట్రిప్స్: ఈ స్ట్రిప్స్ బ్లాక్ హెడ్స్ ను తెరవడంలో సహాయపడతాయి.
స్క్రబ్స్: ముఖం కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్క్రబ్స్ డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో సహాయపడతాయి.
క్లే మాస్క్: క్లే మాస్క్‌లు ముఖంపై ఉన్న అదనపు నూనెను గ్రహిస్తాయి. అంతే కాకుండా బ్లాక్‌హెడ్స్‌ను తగ్గిస్తాయి.
మరికొన్ని చిట్కాలు:
ఆవిరి: వేడి నీటితో ఆవిరి పట్టండి. ఇది చర్మ రంధ్రాలను తెరుస్తుంది. అంతే కాకుండా బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడం సులభం చేస్తుంది.
క్రమం తప్పకుండా ముఖం కడగాలి: తేలికపాటి క్లెన్సర్‌తో రోజుకు రెండుసార్లు ముఖం కడగాలి.
ఆయిల్ ఫుడ్ మానుకోండి: వేయించిన, జంక్ ఫుడ్ తినడం మానుకోండి.
పుష్కలంగా నీరు త్రాగాలి: నీరు త్రాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.
Also Read: చలికాలంలో చర్మంపై పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఇలా చేయండి
గమనిక:
బ్లాక్‌హెడ్స్‌ను మీరే తొలగించుకోవడానికి ప్రయత్నించకండి. ఇది ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావచ్చు.
ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.
సమస్య కొనసాగితే, చర్మవ్యాధి నిపుణులును సంప్రదించండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.