BigTV English

Health Benefits of Blood Donation: రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

Health Benefits of Blood Donation: రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
Blood Donation Benefits
Blood Donation Benefits

Health Benefits of Blood Donation: అన్ని దానాల్లో కెల్లా రక్తదానం ఎంతో గొప్పది. రక్తదానం చేయడం వల్ల ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టినవారవుతారు. కానీ రక్తదానం విషయంలో మనలో చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేయడం వల్ల శరీరం బలహీనంగా తయారవుతుందని, అనేక వ్యాధుల బారిన పడతారనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధారాలు లేని ప్రచారాలు మాత్రమే.


నిజానికి రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదు. రక్తదానంపై కొందరికి మాత్రమే అవగాహన ఉంది. రక్తదానం మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నేపధ్యంలో రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయో తెలుసుకుందాం.

రక్తదానం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానంపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో సరైన సమయంలో బ్లడ్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ జనాభాలో 37 శాతం మంది మాత్రమే రక్తదానం చేయడానికి అర్హులయితే, వారిలో 10 శాతం కంటే తక్కువ మంది రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారట.


గుండె ఆరోగ్యం

రక్తదానం చేయడం వల్ల ఐరన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తదానం చేయకపోవడం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి దారితీస్తుంది. కాబట్టి శరీరంలో ఐరన్ నిల్వఉండటం శరీరానికి మంచిది కాదు.

Also Read: చికెన్ ఇష్టంగా కుమ్మేస్తున్నారా? .. ఈ పార్ట్ తింటే మీ హెల్త్ గోవిందా!

కాలేయం పనితీరు

శరీరంలో ఐరన్ ఎక్కువగా నిల్వుండటం వల్ల అది కాలేయంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో కాలేయం వైఫల్యం చెందడానికి దారి తీయొచ్చు. అయితే రక్తదానం చేయడం వలన ఐరన్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో ఐరన్‌ అదుపులో ఉండటం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది.

కొత్త రక్త కణాల ఉత్పత్తి

రక్తదానం చేయడం వల్ల కొత్త రక్త కణాల ఉత్పత్తి అవుతాయి. కొత్త రక్తం పడుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రక్త కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా రక్తదానం చేయండి.

కేలరీల నియంత్రణ

అర లీటరు రక్తం దానం చేయడం వల్ల దాదాపు 650 కేలరీలు తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు చెబుతున్నారు. అలానే అధిర బరువు ఉన్నవారు రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గించుకోడానికి రక్తదానం చేయొద్దు.

క్యాన్సర్‌ ముప్పు

రక్తదానం చేయడం వల్ల పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు కాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Also Read: భోజనం తర్వాత మజ్జిగ తాగితే బోలెడు లాభాలు.. తెలిస్తే మిస్ చేయరు!

ఎవరు రక్తదానం చేయొచ్చు

రక్తదానం చేయడానికి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అంతకంటే బరువు తక్కువగా ఉంటే రక్తం ఇవ్వకూడదు. అలాగే 60 నుంచి 100 మధ్య బీపీ ఉన్నవారు, శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్‌కు మించని వ్యక్తులు రక్తదానం చేయడానికి అర్హులు.

Disclaimer : ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం మీ అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×