US Surgeon General Research: మద్యం విషయంలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి. కొంత మంది మితంగా మద్యం తాగితే మంచిదంటారు. కొంత మంది రోజూ ఓ పెగ్గు తాగాలంటారు. మరికొంత మంది రోజూ ఓ గ్లాస్ బీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. తరచుగా కొన్ని కొన్ని సర్వేలు, పరిశోధనలు కొన్ని కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తాయి. కొన్ని మద్యం మంచిదని చెప్తే, మరికొన్ని ప్రమాదం అంటాయి. ఏది ఫాలో కావాలో తెలియక జనాలు జుట్టుపీక్కుంటారు.
మద్యం ముప్పుపై US సర్జన్ జనరల్ కీలక ప్రకటన
తాజాగా US సర్జన్ జనరల్ మద్యానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఒక వ్యక్తి తీసుకునే ఆల్కహాల్ మొత్తానికి నేరుగా ముడిపడి ఉంటుందని వెల్లడించారు. మద్యం వినియోగం పెరిగే కొద్దీ ప్రమాదం ముప్పు పెరుగుతుందన్నారు. తాజాగా క్యాన్సర్, ఆల్కహాల్ వినియోగం మధ్యన ఉన్న సంబంధాన్ని వెల్లడించారు. ఆల్కహాల్ వినియోగం(బీరు, వైన్, స్పిరిట్స్) క్యాన్సర్ ముప్పును తీవ్రంగా పెంచుతున్నట్లు తెలిపారు.
ఆల్కహాల్ తో 7 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం
US సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి గతంలో X వేదికగా క్యాన్సర్, ఆల్కహాల్ వినియోగం మధ్య సంబంధం గురించి కీలక సలహా జారీ చేశారు. “U.S.లో క్యాన్సర్ కు కారణాలో ఆల్కహాల్ ప్రధానపాత్ర పోషిస్తున్నది. ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. 20,000 క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి”అని వెల్లడించారు. “ఏ రకమైన ఆల్కహాల్ (బీర్, వైన్, స్పిరిట్స్) తీసుకున్నా కనీసం ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వాటిలో మహిళలకు రొమ్ము క్యాన్సర్లు, కొలొరెక్టమ్, అన్నవాహిక, కాలేయం, నోరు, గొంతు, స్వరపేటిక క్యాన్సర్లు ముఖ్యమైనవి” అని చెప్పుకొచ్చారు.
NEW: Today, I’m releasing a Surgeon General’s Advisory on the causal link between alcohol consumption and increased cancer risk. Alcohol is the 3rd leading preventable cause of cancer in the U.S., contributing to about 100,000 cancer cases and 20,000 cancer deaths each year. pic.twitter.com/sKTlPAZlFw
— U.S. Surgeon General (@Surgeon_General) January 3, 2025
10 ఏండ్లలో 10 లక్షల క్యాన్సర్ కేసులు
క్యాన్సర్ ప్రమాదం ఒక వ్యక్తి తీసుకునే ఆల్కహాల్ మొత్తంతో నేరుగా ముడిపడి ఉంటుందని US సర్జన్ జనరల్ వెల్లించారు. ఆల్కహాల్ తీసుకోవడం పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుందన్నారు. రొమ్ము, నోరు, గొంతు క్యాన్సర్ ప్రమాదం రోజూ ఆల్కహాల్ తాగడం వల్ల ఏర్పడుతుందన్నారు. 2019లో అమెరికాలో 96,730 క్యాన్సర్ కేసులు మద్యపానానికి సంబంధించినవని వైద్యులు తేల్చారు. 10 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. అమెరికాలో క్యాన్సర్ పెరిగేందుకు పొగా వినియోగం, ఊబకాయం తర్వాత ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా కారణం అవుతున్నట్లు వెల్లడించారు. దేశంలోని మొత్తం రొమ్ము క్యాన్సర్లలో 16.4 శాతం ఆల్కహాల్ వినియోగంతో ముడిపడి ఉన్నాయన్నారు. గత రెండు దశాబ్దాలుగా కొనసాగిన పరిశోధన ఈ విషయాలను వెల్లడిస్తుందన్నారు.
ఆల్కహాల్ క్యాన్సర్ కు ఎలా కారణమవుతుంది?
ఆల్కహాల్ నాలుగు రకాలుగా క్యాన్సర్ కు కారణమవుతుంది. “మొదట, ఆల్కహాల్ శరీరంలో ఎసిటాల్డిహైడ్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఎసిటాల్డిహైడ్ అనేది DNAని దెబ్బతీసే మెటాబోలైట్. ఇది శరీరంలోని DNAను నాశనం చేస్తుంది. DNA దెబ్బతిన్నప్పుడు కణాలు నియంత్రణలో లేకుండ పెరుగుతాయి. ఫలితంగా క్యాన్సర్ కణితి ఏర్పడుతుందని US సర్జన్ జనరల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆల్కహాల్ క్యాన్సర్ కు కారణం అవుతుందని తెలిపే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయాపడ్డారు.
Read Also: వాలంటైన్స్ డే ఆ రోజు ఆ రిస్క్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలియకపోతే రస్కులు తింటూ కూర్చోవల్సిందే!