BigTV English

Kidney Care: వీటిని ఎక్కువగా తినేస్తున్నారా.. ఇవి మీ కిడ్నీని పాడు చేస్తాయి జాగ్రత్త..

Kidney Care: వీటిని ఎక్కువగా తినేస్తున్నారా.. ఇవి మీ కిడ్నీని పాడు చేస్తాయి జాగ్రత్త..

Kidney Care: తరచూ మనం తీసుకునే ఆహారంపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. అదే కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం, స్ట్రీట్ ఫుడ్, ఎక్కువ నూనె వస్తువులను తరచూ తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, షుగర్, కిడ్నీల సమస్యలు, గుండె సమస్యలు వంటి తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. అంతేకాదు శరీరంలోని రక్త ప్రసరణకు కూడా అవసరం అయ్యే ఖనిజాలు, లవణాలు, నీటిని కూడా అందించేందుకు ఇవి సహాయపడతాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఖచ్చితంగా వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే 5 ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయని అంటున్నారు.

మయోనైస్ :


షావర్మా, శాండివిచ్, సలాడ్స్, చికెన్ కబాబ్స్ వంటి వాటిలో మయోనైస్ ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని ఎక్కువగా తింటే కిడ్నీల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మయోనైస్ లో 103 కేలరీలతో కూడిన కొవ్వు ఉంటుంది. ఇది అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు:

ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకుంటే అందులో ఉండే షుగర్, సోడియం, కొవ్వు, అధికంగా ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్య అభివృద్ధి చెందుతుంది.

సోడా:

సోడా తీసుకోవడం వల్ల మూత్ర పిండాల వ్యాధి, దంత సమస్యలు, జీవక్రియ సిండ్రోమ్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇందులో ఉండే షుగర్ స్థాయిలు బరువు పెంచేలా చేస్తాయి.

డీ ఫ్రైలు :

డీఫ్రైలు కూడా తినడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. బంగాళదుంపలతో చేసిన ఫ్రైడ్ ఆహారంలో ఉండే పొటాషియం మూత్రపిండాల వ్యాధి పెరుగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×