Big Stories

CM Jagan: ఎన్నికల సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదు.. సీఎం జగన్

CM Jagan Comments: మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సరిగ్గా జరుగుతాయనే నమ్మకం తనకి లేదన్నారు. కూటమి నేత్రలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

తనని అధికారంలో లేకుండా చేయడానికి కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని లేకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమని వెల్లడించారు.

- Advertisement -

ఎన్నికలకు కొద్ది రోజుల మందు ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. దీంతో ఎన్నికలు సరిగ్గా జరుగుతాయని నమ్మకం తనకి లేదని అనుమానం వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టోను నమ్మి మోసపోవద్దన్నారు. 2014లో ఇదే తరహాలో హామీలు ఇచ్చి..గాలికొదిలేశారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రజలకు మంచి చేస్తుంటే.. దాన్ని తప్పుగా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎవరి భూములు వారికి ఇవ్వడమే దాని లక్ష్యమని వెల్లడించారు. భూ వివాదాలు తలెత్తకుండా ఈ యాక్ట్ తీసుకువచ్చామని జగన్ తెలిపారు. యాక్ట్ వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదని.. దానికి ప్రభుత్వం గ్యారింటీ ఉందని హామీ ఇచ్చారు.

వైసీపీకి షాక్ ఇచ్చిన ఈసీ..
అయితే ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వానికి ఈసీ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసేందుకు అనుమతిని ఈసీ నిరాకరించింది. లబ్ధిదారులకు నిధులు విడుదల చేసేందుకు అనుమతివ్వాలంటూ ఇప్పటికే పలుమార్లు ఈసీని వైసీపీ ప్రభుత్వం కోరింది. అయితే ప్రస్తుతం ఏ ఒక్క పథకానికి కూడా నిధులు విడుదల చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. రాజధానుల పేరిట లూటీ : పీఎం మోదీ

ఖరీఫ్ కు సన్నద్ధమవుతున్న రైతులకు అందించే ఇన్ పుట్ సబ్సిడీని అందించడానికి కూడా ఈసీ నిరాకరించింది. విద్యార్థులకు అందించే ఫీజు రియింబర్స్ మెంట్ నిధులు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయడానికి వీలు లేదని ఈసీ వైసీపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News