Health Tips: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూజలు, వ్రతాలు మొదలవుతుంటాయి. ఏడాది మొత్తంలో శ్రావణ మాసంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తల్లి పార్వతీ దేవి, శివుడిని పూజిస్తుంటారు. అందువల్ల నెలంతా పండుగలతో ఉంటుంది. వరమహాలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం, శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం, ఇలా శ్రావణంలోని ప్రతీ రోజుకూ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల నెల రోజుల పాటు ఉండే శ్రావణ మాసంలో మాంసాహారాన్ని అస్సలు తీసుకోరు. అయితే ఇది మతపరమైన కారణాలు అయితే దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంటుందట. అయితే అదేంటో తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. వర్షాకాలం అంటేనే ఇన్ఫెక్షన్లు గుర్తొస్తుంటాయి. అంటువ్యాధులు వంటివి సోకుతుంటాయి. వర్షం కారణంగా బ్యాక్టీరియా, వైరస్ వంటివి వ్యాపిస్తుంటాయి. అందువల్ల వర్షాకాలంలో జలాచరాలు సంతానోత్పత్తి చేస్తుంటాయి. అందువల్ల ఈ సమయంలో సముద్ర జలాచరాలు తినడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చేపలను తినడం వల్ల పునరుత్పత్తికి ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా చేపల సంఖ్య కూడా తగ్గిపోతుంది.
ఈ కారణంగా శ్రావణ మాసం అంతా చేపలతో సహా మాంసాన్ని తినడం మానేస్తారు. మరోవైపు వర్షాకాలంలో నీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. వర్షం నీటి కారణంగా మంచి నీటిలో మురికి నీరు చేరిపోయి రోగాలు, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు వంటివి సోకుతుంటాయి. అయితే ఆ నీటిని తాగిన జంతువులను తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల శ్రావణ మాసం మొత్తం మాంసాహారం తినడాన్ని నిషేధిస్తారు.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)