Cashew Side effects: జీడిపప్పులు ప్రతిరోజూ తినేవారు ఎంతోమంది. జీడిపప్పులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగని ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి పడతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పెడతాయి. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు ఎన్నో అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.
జీడిపప్పులు నట్స్ జాబితాలోకి వస్తాయి. ఈ జీడిపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. జీడిపప్పుల్లో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీటిలో మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. జీడిపప్పులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా ఉంటాయి. ఇది కొంతమందిలో జీర్ణక్రియకు సమస్యగా మారుతుంది. అందుకే జీడిపప్పులను తిన్నా కూడా చాలా మితంగా తినాలి. అధికంగా తింటే గ్యాస్ట్రిక్, పొట్ట ఉబ్బరానికి దారి తీసే అవకాశం ఉంది.
జీడిపప్పుల్లో డైటరీ ఫైబర్ తక్కువగా ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడడానికి, పేగు కదలికలను చురుగ్గా ఉండేలా చూసుకోవడానికి పీచు పదార్థం అవసరం. ఎప్పుడైతే పీచు పదార్ధం తక్కువగా ఉండడం వల్ల జీడిపప్పులు సరిగా జీర్ణం కావు. అవి పొట్ట ఉబ్బరానికి, గ్యాస్ ఏర్పడడానికి కారణం అవుతాయి.
జీడిపప్పులు ఫైటేట్లు ఉంటాయి. ఇవి ఆహారంలో లభించే సహజ సమ్మేళనాలు. ఫైటేట్లు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం తక్కువే. ఈ ఫైటేట్ సమ్మేళనాలు శరీరంలో పెరిగితే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. దీనివల్ల పొట్టలో గ్యాస్ ఉత్పత్తి పెరిగిపోతుంది.
జీడిపప్పును జీర్ణం చేయడానికి మన జీర్ణవ్యవస్థ ఎంతో కష్టపడుతుంది. అందుకే వాటిని తక్కువగా తింటే మంచిది. కొంతమందికి జీడిపప్పు వల్ల అలెర్జీలు కూడా కలిగే అవకాశం ఉంది. అలర్జీలు కూడా కడుపు ఉబ్బరం, గ్యాస్ ఉత్పత్తి కావడం వంటి లక్షణాలతోనే కనిపిస్తుంది. మీకు జీడిపప్పు తిన్న వెంటనే పొట్టలో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తున్నా… పొట్ట ఉబ్బరంగా అనిపిస్తున్న వాటిని తక్కువగా తినాలని తెలుసుకోండి.
తినాలనిపిస్తే వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం అయ్యాక తినడం వల్ల ఎలాంటి ఉబ్బరం సమస్యలు రాకుండా ఉంటాయి. వాటిని అలా నీటిలో నానబెట్టుకుండా తింటే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జీడిపప్పులు తిన్న తరువాత మీకు చర్మ సమస్యలు, దద్దుర్లు, దురదలు వంటివి కనిపిస్తే మీకు అవి పడడం లేదని అర్థం చేసుకోండి. వీటికి అలెర్జీలను పెంచే గుణం ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు జీడిపప్పులను తినకూడదు. ఇవి కొవ్వు స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీలైనంత తక్కువగా తినాల్సిన అవసరం ఉంది.