Big Stories

Coconut Water Side Effects: కొబ్బరి నీళ్లు మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?

Side Effects of Coconut Water: వేసవి ప్రారంభమై ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు గొంతు ఎండిపోతుంది. డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, నీరసం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. దీంతో అందరూ కొబ్బరి నీళ్లు తిగమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సంమృద్ధిగా ఉంటాయి. ఇవన్ని కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

- Advertisement -

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండ వేడికి తట్టుకోడానికి రోగనిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయి. అంతేకాకుండా కొబ్బరి నీళ్లు జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం కొన్ని వ్యాధులు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇవి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అధికంగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఏయే వ్యాధులు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాడకూడదో తెలుసుకుందాం.

- Advertisement -

అలర్జీలు
అలర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల దురద, చర్మం దురద, మంట, చర్మం ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మీకు కూడా శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగకండి.

Coconut Water Side Effects
Coconut Water Side Effects

Also Read: ఏసీ వాడుతున్నారా.. అయితే టెంపరేచర్ ఎంత ఉండాలంటే!

అధిక రక్తపోటు
అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు. తాగేమందు
వైద్యుల సలహా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఉంటుంది. బీపీ మందులతో కలిపితే శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. మీకు హైబీపీ సమస్య ఉంటే కొబ్బరి నీళ్లు తాగకండి.

కిడ్నీ రోగులు
కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కొబ్బరినీళ్లు అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం చాలా ఎక్కువ. కాబట్టి కిడ్నీలు కొబ్బరి నీళ్లను సరీగా ఫిల్టర్ చేయలేవు. దీని వల్ల అది తాగిన తర్వాత కిడ్నీలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది క్రమంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

Also Read: పుచ్చకాయతో ఈ వ్యాధులు మాయం!

డయాబెటిక్ రోగులు
షుగర్ వ్యాధిగ్రస్తులు కొబ్బరినీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే కార్బోహైడ్రేట్ల పరిమాణం కూడా చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లుతాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించి కొబ్బరి నీళ్లు తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News