Coconut Benefits: కొబ్బరితో ఎన్నో రకాల రుచికరమైన వంటలను తయారుచేసుకోవచ్చు. ఎక్కువగా ఇది దక్షిణ భారతదేశంలో వాడుతుంటారు. ప్రతీ వంటకాల్లోను కొబ్బరిని ఉపయోగిస్తుంటారు. అందువల్ల అక్కడ ప్రతీ ఒక్కరు అందంగాను, యవ్వనంగాను కనిపిస్తుంటారు. అయితే కొబ్బరిని సాధారణంగా అయితే కొబ్బరి చట్నీ, సాంబార్, కొబ్బరి అన్నం, కొబ్బరి స్వీట్ వంటి రకరకాల పదార్థాలను తయారుచేసుకుని ఆస్వాదిస్తుంటారు అని మాత్రమే తెలుసు. అంతేకాదు కొబ్బరిని పొడిగా చేసుకుని ప్రతీ వంటల్లోను ఉపయోగిస్తే ఎంతో రుచికరమైన ఆహారాన్ని తినవచ్చు. అయితే పచ్చి కొబ్బరితో ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చని కూడా అంటున్నారు. కొబ్బరిలో ఫైబర్, విటమిన్ సి, ఈ, బి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని కూడా రక్షిస్తాయి.
పచ్చి కొబ్బరి జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. కొబ్బరిలో ఉండే విటమిన్లు, మినరల్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మాన్ని కూడా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ముఖ్యంగా వయసు మీద పడుతున్న వారికి ఇది ఓ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. చర్మంపై ముడతలు, మచ్చలు వంటి వాటిని తొలగించేందుకు తోడ్పడుతుంది.
కొబ్బరిలో పుష్కలమైన విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు వంటి ఉండడం వల్ల ఇవి బరువును తగ్గించుకోవడానికి కూడా సహాయడపతాయి. అందువల్ల తరచూ కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలిని తగ్గించి బరువు నియంత్రిస్తుంది. అధిక కేలరీలు తీసుకోవడం వంటి వాటిని కూడా నిరోధిస్తుంది.
కొబ్బరి కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అందులో ముఖ్యంగా ప్రస్తుతం ఎదుర్కుంటున్న గుండె సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మంచి కొలస్ట్రాల్ పెంచి, చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థలను బలపరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం ఎముకలను బలోపేతం చేసేందుకు సహాయపడతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.