BigTV English

Black Salt: బ్లాక్ సాల్ట్ తో బెనిఫిట్స్ ఎన్నో..

Black Salt: బ్లాక్ సాల్ట్ తో బెనిఫిట్స్ ఎన్నో..

Health Benefits Of Black Salt: బ్లాక్ సాల్ట్ ను వివిధ ఆహారపదార్థాలు, డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తారు. బ్లాక్ సాల్ట్ ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.


ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు సాధారణమైనవిగా అనిపించవచ్చు. కానీ వాటిలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నల్ల ఉప్పు కూడా అలాంటిదే. బ్లాక్ సాల్ట్ సరైన మోతాదులో తినడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి వంటగదిలో అందుబాటులో ఉండే బ్లాక్ సాల్ట్ ను చాట్ లేదా సలాడ్ లల్లో ఉపయోగించడం వల్ల అది వాటి రుచిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బ్లాక్ సాల్ట్ యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి అని చెప్పొచ్చు.

నల్ల ఉప్పు ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.గ్యాస్,ఎసిడిటీ వంటి సమస్యలను నిరోధించడంలో ఉపయోగపడుంది.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారు రోజులో చిటికెడు నల్ల ఉప్పు ఉపయోగించడం వల్ల చాలా మేలు కలుగుతుంది. కడుపు నొప్పిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.


Also Read: పచ్చి కొబ్బరిలోని పోషకాలు తెలిస్తే..అస్సలు వదిలిపెట్టరు !

బ్లాక్ సాల్ట్ ఆహార పదార్థాల్లో వాడితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏ పదార్థాన్నైనా మితిమీరి తీసుకుంటే హానికరం కాబట్టి బ్లాక్ సాల్ట్ కూడా పరిమితంగా తీసుకోవాలి. బరువు తగ్గడానికి బ్లాక్ సాల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆహారంలో సలాడ్, డ్రింక్స్ లో నల్ల ఉప్పును వేసుకుంటే బరువును తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×