IND w vs BAN w: మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన అండర్ -19 ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత మహిళా జట్టు. మహిళల విభాగంలో టి-20 ఫార్మాట్ లో తొలిసారిగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టుని భారత జట్టు చిత్తు చేసింది. బంగ్లాదేశ్ మహిళల జట్టును భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో మొట్టమొదటి మహిళల ఆసియా కప్ అండర్-19 {IND w vs BAN w} టోర్నిని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు పవర్ ప్లే ముగిసే లోపే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ
బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. {IND w vs BAN w} దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గొంగడి త్రిష (52) పరుగులతో హాఫ్ సెంచరీ చేసి చెలరేగింది. ఈమెతో పాటు మిథిలా వినోద్ (17), కెప్టెన నిక్కీ ప్రసాద్ (12) పరుగులతో రాణించారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా ఈస్మీన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నిషిత అక్టర్ నిషి 2, హబీబా ఇస్లాం ఒక వికెట్ సాధించారు. అనంతరం 118 పరుగుల లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆది నుండే తడబడింది.
కేవలం 76 పరుగులకే బంగ్లా జట్టు కుప్పకూలింది. బంతికి ఒక పరుగు తీసినా బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించేది. కానీ భారత బౌలర్లు మాత్రం పరుగులు ఇవ్వలేదు. కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఆ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 41 పరుగుల భారీ తేడాతో భారత జట్టు విజయం సాధించింది. {IND w vs BAN w} బంగ్లా బ్యాటర్లలో జువైరియా ఫెర్దౌస్ (22), ఫహౌమిదా చోయా (18) ఈ ఇద్దరు మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు అందరూ విఫలం కావడంతో బంగ్లా జట్టు ఓటమిపాలైంది.
Also Read: Robin Uthappa Arrest : క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఫ్రాడ్ కేసు
భారత బౌలర్లలో ఆయూషి శుక్ల 3, సోనమ్ యాదవ్ 2, పరుణికా సిసోడియా 2, వీజే జోషిత 1 వికెట్లు పడగొట్టి {IND w vs BAN w} భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక ఇటీవల జరిగిన పురుషుల అండర్ – 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ మహిళల జట్టు మాత్రం ఈసారి రివెంజ్ తీర్చుకుంది. విశేషం ఏంటంటే అండర్ – 19 మహిళల ఆసియా కప్ నిర్వహించడం ఇదే మొదటిసారి మొదటి ఎడిషన్ లోనే భారత జట్టు విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది.
🏆 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 🏆
India beats Bangladesh by 41 runs in the final to clinch the inaugural Women’s U-19 Asia Cup.
More Details ➡️ https://t.co/nO6ThMfqGK#CricketTwitter pic.twitter.com/4BxMXIXypG
— Sportstar (@sportstarweb) December 22, 2024