Headache: తలనొప్పిని ఎప్పుడో ఒకప్పుడూ ప్రతి ఒక్కరు ఎదుర్కునే ఉంటారు. తలనొప్పి అనేది ఒత్తిడి, అలసట, నిద్ర లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల వచ్చే ఒక సాధారణ సమస్య. తలనొప్పికి మార్కెట్‌లో అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, తేలికపాటి తలనొప్పిని మందులు లేకుండా కూడా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు.
ఈ రెమెడీలు సహజమైనవే కాదు.. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తలనొప్పిని ఈజీగా తగ్గించుకునేందుకు కొన్ని రకాల హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలి. అంతే కాకుండా ఉపయెగించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ టీ:
నిమ్మకాయ తలనొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లెమన్ టీ తయారు చేయడానికి ఒక కప్పు నీళ్లలో కాస్త లెమన్ జ్యూస్ వేసి మరిగించి తర్వాత వడగట్టి తాగాలి. దీని రుచి, వాసన మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది.
తులసి ఆకులు:
తులసి ఆకులు సహజ నొప్పి నివారిణి. కండరాల ఉపశమనకారిగా ఇవి పరిగణించబడతాయి. ఎక్కువగా తలనొప్పి ఉన్నట్లయితే, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి దాని టీ త్రాగాలి. తులసి ఆకులను పేస్ట్ లాగా చేసి తలకు పట్టించాలి. ఈ రెమెడీ కూడా తలనొప్పిని తగ్గిస్తుంది . అంతే కాకుండా మీ శరీరానికి ప్రశాంతతను కలిగిస్తుంది.
పిప్పరమెంటు నూనె:
పిప్పరమింట్ ఆయిల్ తేలికపాటి తలనొప్పికి అద్భుతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇందులో మెంథాల్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాకుండా కండరాలను రిప్రెష్ చేస్తుంది. మీ నుదిటిపై కొన్ని చుక్కల పిప్పరమెంటు నూనెను సున్నితంగా మసాజ్ చేయండి. దీంతో తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఐస్ ప్యాక్ :
మీ తలనొప్పికి ఐస్ ప్యాక్ ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక గుడ్డలో కొన్ని ఐస్ క్యూబ్‌లను చుట్టి మీ నుదిటిపై లేదా మీ మెడ వెనుక భాగంలో ఉంచండి. ఇది రక్త నాళాల్లో ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతే కాకుండా తక్షణమే తలనొప్పిని తగ్గించేందుకు కూడా దోహదం చేస్తుంది.
Also Read: 7 రోజులు దానిమ్మ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
పుష్కలంగా నీరు త్రాగాలి :
శరీరంలో నీరు లేకపోవడం కూడా కొన్నిసార్లు తలనొప్పికి కారణం అవుతుంది. సరిపడా నీళ్లు తాగకపోతే తలనొప్పి రావడం సహజం. అటువంటి పరిస్థితిలో, మీకు తలనొప్పి ఉన్నప్పుడు, మొదట ఒక గ్లాసు నీరు త్రాగాలి, ఆపై ప్రతి గంటకు నీరు త్రాగాలి. ఇది శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. ఫలితంగా తలనొప్పి క్రమంగా తగ్గుతుంది. శరీరానికి తగిన నీరు తాగినప్పుడు మాత్రమే జీర్ణ సంబంధిత ప్రక్రియలు కూడా సక్రమంగా జరుగుతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహన మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.