Big Stories

Eyes Blinking in 1 Minute: మీరు నిమిషానికి ఎన్నిసార్లు కళ్లు ఆర్పుతున్నారు..?

Eyes Blinking :
Eyes Blinking

How many times Blinking Eye in 1 Minutes: రెప్పవేయడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. రెప్పవేయకుండా ఎవరూ కూడా ఉండలేరు. రెప్పవేయడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రెప్పల వలన కళ్లపై తేమ ఉంటుంది. అలానే కార్నియా ఉపరితలం శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కళ్లకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. కానీ మీరు రెప్పలు ఎలా కొడుతున్నారు. ఎన్నిసార్లు కొడుతున్నారనేది మీ ఆరోగ్యం గురించి చెబుతుందట. దీన్ని బట్టి మీ ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అదేంటో చూడండి.

- Advertisement -

రెప్పలు నిమిషానికి 14 లేదా 17 సార్లు సహజంగా కొట్టుకుంటాయి. కానీ కొందరిలో ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది.ఇది మన శరీరంలో ఏదో ఒక అనారోగ్య సమస్యకు సంకేతమని గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

పార్కిన్సన్స్ వ్యాధి

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్కిన్సన్స్ డిసీజ్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం.. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగుల రెప్పపాటులో తేడా ఉంటుంది. నిమిషానికి ఒకటి లేదా రెండు సార్లు కంటే తక్కువ రెప్పపాటు ఉంటున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అలానే రెప్పపాటు మెదడులోని డోపమైన్ చర్యకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది. పార్కిన్సన్స్ వ్యాధి ముఖ్య లక్షణం డోపమైన్ ఉత్పత్తి చేసే నరాల కణాలపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల నెమ్మదిగా రెప్పపాటు మందగిస్తుంది. చేతులు కూడా వణుకుతాయి.

Also Read: పరగడుపున ఈ డ్రింక్ తాగితే ఎన్ని లాభాలో.. ఆ సమస్యలకు చెక్

మీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే పార్కిన్సన్ వ్యాధిగా గుర్తించాలి. ఈ వ్యాధి సాధారణంగా 60 ఏళ్ల తర్వాత వస్తుంది. కానీ కొందరు 50 ఏళ్లకే ఈ వ్యాధి బారినపడొచ్చు. కాబట్టి మీరు కూడా మీ కళ్ల రెప్పపాటు, కదలికలు మందగించడం గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఈ లక్షణాలు పార్కిన్సన్స్ వ్యాధికి కారణం కావచ్చు. అమెరికాలోనే దాదాపు లక్షన్నర మంది పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

గ్రేవ్స్ వ్యాధి

మీ రెప్పపాటు సాధారణ స్థాయికంటే తక్కువగా ఉంటే గ్రేవ్స్ వ్యాధి కూడా అయిండొచ్చు. ఈ వ్యాధి థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తి వల్ల వస్తుంది.ఈ వ్యాధి బారినపబడితే.. ఆ వ్యక్తి చేతులు, వేళ్లలో తేలికపాటి వణుకు ఉంటుంది. బరువు ఒక్కసారిగా తగ్గిపోతారు. థైరాయిడ్ గ్రంథిలో వాపు కనిపిస్తుంది. అలానే దవడలు, కళ్లు, పాదాల్లో వాపు లేదా ఎర్రబడతాయి. 20 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఈ వ్యాధి సాధారణంగా సోకుతుంది. ఈ వ్యాధి కళ్లను ప్రభావితం చేస్తుంది. ప్రతి 100 మంది అమెరికన్ స్త్రీలలో ఒకరికి గ్రేవ్స్ వ్యాధి ఉంటుంది. దీనివల్ల కనురెప్పలు పెద్దవిగా, బిగుతుగా మారతాయి.

Also Read: ఎండలో తిరిగి ముఖానికి టాన్ పట్టేసిందా?.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

2011లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం.. గ్రేవ్స్ వ్యాధితో బారిన పడిన వ్యక్తుల్లో కంటి మెరుపులో తేడా ఉంటుంది. నిమిషానికి 13 సార్లు మాత్రమే రెప్ప వేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వారిలో కంటి మెరుపు ఎక్కువగా ఉంటుంది. వీరు నిమిషానికి సగటున 20 సార్లు కంటిరెప్ప వేస్తారు. అంతేకాకుండా ఈ వ్యాధి ఉన్న ఉన్నవారిలో రెప్పవేయడం అలసటగా అనిపిస్తుంది. కళ్లు పొడిబారతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి స్జోగ్రెన్ సిండ్రోమ్. దీన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధిగా కూడా పిలుస్తారు. ఈ వ్యాధి కంటి రోగనిరోధక వ్యవస్థ గ్రంధులపై దాడి చేసి కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. అలానే దీని కారణంగా కళ్లు దురదగా, చికాకుకుగా ఉంటాయి. ఏ పనిపై ఫోకస్ కూడా చేయలేరు.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News