Clove Water Benefits: ఇంట్లోని వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. లవంగాన్ని ఔషధంగా చాలా వాటిల్లో ఉపయోగిస్తారు. దీనితో ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. లవంగాలు ముఖ్యంగా జీర్ణ సమస్యకు, దంతాల సమస్యకు చెక్ పెట్టేందుకు తోడ్పడుతుంది. వర్షాకాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు వంటి సమస్యలకు లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు దగ్గు, జలుబును నివారించడానికి తోడ్పడతాయి. అయితే ఇవన్నీ సాధారణమే అయినా కూడా లవంగాలతో పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి.
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి లవంగాలను తరచూ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పంచడమే కాకుండా పంటినొప్పితో బాధపడేవారికి కూడా ఇవి సహాయపడుతుంది. అంతేకాదు భోజనం సమయంలో లవంగాలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల అసిడిటీ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కూడా నివారించవచ్చు.
పంటినొప్పితో బాధపడే వారు లవంగం తింటే ఆ సమస్యను చెక్ పెట్టవచ్చు. అంతేకాదు నోటి దుర్వాసను కూడా లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. తరచూ రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల కొన్ని రోజులకు నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అంతేకాదు నోటిలోని బ్యాక్టీరియాను కూడా ఇది చంపేస్తుంది.
ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు లవంగం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు తరచూ లవంగం టీ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి లవంగం నీరు అద్భుతంగా పనిచేస్తుంది. లవంగం నీటిని తరచూ తీసుకుంటే శరీరంలోని టాక్సిన్లు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. లవంగం రెగ్యులర్ గా తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)