BigTV English

Husband and Wife Problems: మీ భర్త ఎక్కువగా అబద్దాలు చెబుతున్నాడా? అతడి బుద్ధిని మార్చాలంటే ఇలా చేయండి

Husband and Wife Problems: మీ భర్త ఎక్కువగా అబద్దాలు చెబుతున్నాడా? అతడి బుద్ధిని మార్చాలంటే ఇలా చేయండి

భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది విలువైన అనుబంధం. ఇందులో తగాదాలు, వాదనలు ఉంటూనే ఉంటాయి. ఆ చిన్న చిన్న గొడవలు, ప్రేమలు సంసారంలో సహజమే. అయితే కొంతమంది భర్తలు చాలా సులువుగా భార్యలతో పదే పదే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. నిజానికి ఈ విషయాన్ని వారు చాలా తేలికగా తీసుకుంటారు. అయితే భార్యల విషయంలో మాత్రం అబద్ధాలు చెప్పడం అనేది తీవ్రంగా భావించాలి. ప్రతి విషయాన్ని అబద్ధంగా మార్చే భర్త దేని గురించైనా మీ దగ్గర దాచే అవకాశం ఉంది. అబద్ధాలు చెప్పడం అనే అంశాన్ని భార్య తేలికగా తీసుకోకూడదు. భర్తకు ఉన్న ఆ అలవాటును మానిపించాలి. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


పిల్లలు అవే నేర్చుకుంటారు
అబద్ధాలు చెబుతున్న భర్త నుంచి పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. చుట్టుపక్కల వారికి కూడా మీ మీద నమ్మకం పోతుంది. మీకు విలువ ఇవ్వడం తగ్గిస్తారు. అబద్దాలు చెప్పే భర్తతో ఉండే భార్యకు కూడా సమాజంలో విలువ ఉండదు. వారి పిల్లలను కూడా చిన్న చూపు చూస్తారు. కాబట్టి మీ భర్తకు అబద్దాలు చెప్పే అలవాటును మానిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అబద్ధం అనేది చిన్న పదమే కావచ్చు కానీ భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని అది విచ్చిన్నం చేస్తుంది. అనుబంధంలో చీలికలను తీసుకొస్తుంది. కాబట్టి మీ మీ భర్తకు అబద్దాలు చెప్పే అలవాటును మీరే మానిపించాలి.


అబద్దాలను నిలదీయండి
ముందుగా మీ భర్త అబద్ధాలు చెబుతున్న సంగతిని మీరు గ్రహించినట్టు అతనికి అర్థం అవ్వాలి. ఈ విషయాన్ని మీరు బహిరంగంగా మాట్లాడాలి. అబద్ధం చెప్పడం ఎంత ప్రమాదకరమో అతనికి వివరించాలి. ప్రజల ముందు ఎంత చులకనగా అవుతారో కూడా మీ భర్తకు వివరించి చెప్పండి. అతను ఒకసారి చెప్పినప్పుడు వినకపోవచ్చు, కానీ ప్రతిరోజు అలా చెబుతూనే ఉండండి. అబద్ధం చెప్పినప్పుడల్లా అది అబద్ధం అని మీరే గట్టిగా అతనికి నొక్కి చెప్పండి. అబద్ధాలు చెప్పడం వల్ల తాను ఇకపై ఏదీ నమ్మనని వివరించండి. అబద్దాలు చెప్పడం మానుకోమని చెప్పండి.

కారణం తెలుసుకోండి
మీ భర్త అబద్ధాలు చెప్పడానికి కారణాన్ని అన్వేషించండి. మీ భర్త భావాలను మీరు అర్థం చేసుకుంటే అతను అబద్ధాలు చెప్పే అవకాశం తగ్గవచ్చు. కాబట్టి మీరు ముందు అతడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు మీతో ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడో తెలుసుకోండి. మీ భర్తతోనే కూర్చొని మాట్లాడండి. మీకు తెలిసిన నిజాలను చెప్పండి. అతనిపై కోపం తెచ్చుకొని అరవకుండా ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. నిజమనేది బంధంలో ఎంత అవసరమో వివరించండి.

అబద్దాలు చెప్పడం వెనుక కారణం తెలుసుకోండి
ఎక్కువగా సమస్యలు వచ్చినప్పుడే భర్త అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఆ సమస్య ఏంటో తెలుసుకోండి. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో చిట్కాలు చెప్పండి. మీరే కౌన్సిలర్ గా మారండి లేదా మంచి కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్లండి. మీరు మీ భర్తతో ఎక్కువ సమయం మాట్లాడండి. అతను అబద్ధాలు చెప్పే అవకాశాన్ని మీరు ఇవ్వకండి. ఏదైనా విషయం అతను చెప్పగానే మీరు అరవడం మొదలుపెడితే అతడు నిజం చెప్పేందుకు భయపడతాడు. అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. కాబట్టి మీరు మీకు నచ్చని విషయాన్ని మీ భర్త నోటి నుంచి వినాల్సి వచ్చినా ఓపికగా ఉండండి. అంతే తప్ప ఒక్కసారిగా విరుచుకుపోతే అతడు అన్ని విషయాలు అబద్దాలుగా మార్చి చెప్పడం ప్రారంభిస్తాడు.
కాస్త ఓపిక పట్టండి
అబద్దాలు చెప్పే అలవాటు మానాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఓపిక మీకు ఉండాలి. అయితే అతడు అబద్దాలు చెబుతున్న సంగతి మీ స్నేహితులు, సన్నిహితుల దగ్గర పదేపదే మాట్లాడకండి. ఇది మీ భర్తలో ఎంతో వేదనను గురిచేస్తుంది. మీపై వ్యతిరేక భావనను పెంచుతుంది. కాబట్టి మీ భర్తను అర్థం చేసుకొని అతడి చేత అబద్ధాలు మానిపించేందుకు ప్రయత్నించండి. మీ భర్త తరచు అబద్దాలు చెబుతున్నప్పుడు అతడిని కూర్చోబెట్టి మీ అనుబంధం ఆ అబద్దాల వల్ల ఎంత బలహీనంగా మారుతుందో వివరించండి. కష్టమో సుఖమో కలిసి బతుకుదామని ఎలాంటి అబద్ధాలు చెప్పవద్దని వివరించండి. అతడికి మీ తోడు మీ మాట సాయం ఉంటే కచ్చితంగా అబద్ధాలు చెప్పే అలవాటును మానేస్తాడు. మేము చెప్పిన పద్ధతిని ఒకసారి ప్రయత్నించి చూడండి. కచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Related News

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Big Stories

×