BigTV English

Mayonnaise: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు

Mayonnaise: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు
Advertisement

Mayonnaise: సాండ్‌విచ్‌లో, బర్గర్లో, సలాడ్‌లో ఏదైనా సరే… క్రీమీ గా ఉండే మయోన్నైస్ పడాల్సిందే. అది కాస్త ఉప్పగా ఉంటుంది, కాబట్టి పిల్లలకి పెద్దలకు తెగ నచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మయోన్నైస్ ఎంతో ప్రాచుర్యం పొందింది. మయోన్నైస్ అధికంగా తినేవారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు నిపుణులు. అలా ఎందుకు చెబుతున్నారో కారణమేంటో కూడా వివరిస్తున్నారు.


మయోన్నైస్ తో గుండె సమస్యలు
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మయోన్నైస్‌లో అధిక కొలెస్ట్రాల్, అధిక కేలరీలు ఉంటాయి. గ్లూకోజ్ స్థాయిలను కూడా ఇది పెంచుతుంది. అలాగే ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా మయోన్నైస్ లో ఎక్కువ. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యం పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మయోన్నైస్ కాస్త కలుషితమైనా కూడా తీవ్రమైన ఫుడ్ పాయిజన్‌కి కారణం అవుతుంది. మయోన్నైస్‌లో బ్యాక్టీరియా పెరగడం చాలా సులువు. అందుకే మయోన్నైస్ తీసుకునే ముందు చాలా ఆలోచించాలి. అధిక రక్తపోటుతో బాధపడేవారు, మధుమేహం ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు మయోన్నైస్‌కు దూరంగా ఉంటేనే మంచిది.

తరచూ మయోన్నైస్‌ను తినడం వల్ల అది శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఇది గుండెపోటుకు కారణం అయ్యే కొలెస్ట్రాల్. కాబట్టి మయోనైస్ తినడం ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


డయాబెటిస్ వస్తుంది
ఒక టేబుల్ స్పూన్ మయోనెస్ లో 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అమాంతం పెంచే శక్తి కలది. కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మీరు బరువు కూడా త్వరగా పెరుగుతారు. కొలెస్ట్రాల్ పెరగడం, దానివల్ల బరువు పెరగడం అనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఇది పెంచుతుంది. కాబట్టి మీరు త్వరగా టైప్2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది.

Also Read: ప్రతిరోజూ ఉదయం పచ్చి కొబ్బరిని తినేందుకు ప్రయత్నించండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

మయోన్నైస్ ఒక్కసారిగా మానేయడం కష్టమైతే దాని బదులు ఇతర పదార్థాలను వాడండి. మయోన్నైస్ కు బదులు అవకాడో గుజ్జును వాడితే బెటర్. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవకాడోలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.

గ్రీక్ యోగర్ట్.. దీన్ని తీయని పెరుగు అని చెప్పుకోవచ్చు. సలాడ్లు వంటి వాటిలో మయోన్నైస్ కు బదులు గ్రీక్ యోగర్ట్ మిక్స్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.

నిజానికి మయోన్నైస్ తినడం వల్ల ఆరోగ్యానికి పెద్ద లాభాలు లేవు. అనారోగ్యాలు తెస్తుంది తప్ప, మయోన్నైస్ కలిగే అరోగ్యా ప్రయోజనాలు సున్నా అనే చెప్పాలి. దీనిలో ఉప్పదనం ఎక్కువ కాబట్టి అధిక రక్తపోటు ఉన్న వారు దీన్ని పూర్తిగా మానేయాలి.

Related News

Diwali 2025: లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదం.. ఇలా చేసి నైవేద్యం సమర్పించండి

Diwali Wishes 2025: హ్యాపీ దీపావళి సింపుల్‌గా.. విషెల్ ఇలా చెప్పేయండి

Bathing: స్నానం ఎంతసేపు చెయ్యాలి? స్నానానికి ఉన్న అసలు ప్రాముఖ్యం ఇదే!

Sleeping without pillow: దిండు లేకుండా నిద్రపోతే శరీరానికి జరిగే అద్భుత మార్పులు ! తెలుసుకుంటే ఇకపై దిండు వేసుకోరేమో!

Memory: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తినండి..

Dry Skin: డ్రై స్కిన్ సమస్యా ? ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్

Cracked Heels:పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం.. వీటితో అద్భుతమైన రిజల్ట్

Almonds: పొరపాటన కూడా బాదంతో పాటు ఇవి తినొద్దు !

Big Stories

×