EPAPER

Heart Problems: స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి, ఎందుకు?

Heart Problems: స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి, ఎందుకు?
Heart Problems: గుండెపోటు బారిన పడిన సంఘటనలు అధికంగా మగవారిలోనే కనిపిస్తాయి. అలాగే గుండెలో స్టెంట్లు వేయడం అనేది కూడా పురుషుల్లో అధికంగా ఉంటుంది. స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీనికి జీవసంబంధమైన హార్మోన్ల కారణం ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఏటా హృదయ సంబంధ వ్యాధుల వల్ల రెండు కోట్ల మందికి పైగా మరణిస్తున్నారు. వీరిలో స్త్రీల కన్నా పురుషుల సంఖ్య అధికంగా ఉంది.
హార్మోన్ల తేడాలు
గుండె జబ్బులు బారిన పడడంలో హార్మోన్ల తేడాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెనోపాజ్ ముందు మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోను అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోను చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టే గుండె సమస్యలు పురుషుల్లో అధికంగా వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మెనోపాజ్ తర్వాత స్త్రీలలో గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. మెనోపాజ్ బారిన పడిన మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.
మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటుంది. వారు ధూమపానం అధికంగా చేస్తారు. మద్యపానం, అనారోగ్యమైన ఆహారాలు అధికంగా తీసుకుంటూ ఉంటారు. అందుకే గుండె జబ్బుల బారిన పురుషులు అధికంగా పడుతూ ఉంటారు. ధూమపానం అనేది కరోనరీ ధమనులను కుచించకపోయేలా చేస్తుంది. లేదా ధమనుల్లో అడ్డంకులు ఏర్పడేలా చేసి గుండెకు రక్తప్రసరణను తగ్గేలా చేస్తుంది. ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులే అధికంగా ధూమపానం చేస్తారు, కాబట్టి పురుషులకి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఆల్కహాల్ వినియోగం కూడా స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ. స్త్రీలలో కూడా ధూమపానం చేసేవారు ఉన్నారు. అయితే వారు మితంగానే తీసుకుంటారు. పురుషులు మాత్రం స్పృహ కోల్పోయేంతగా తాగుతూనే ఉంటారు. అందుకే వారు త్వరగా గుండెపోటు బారిన పడుతూ ఉంటారు.
ఒత్తిడి నిర్వహించడం
ఒత్తిడి స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఉంటుంది. అయితే మహిళలు ఒత్తిడిని తట్టుకునే శక్తిని కొంతవరకు కలిగి ఉంటారు. పురుషులు మాత్రం ఒత్తిడిని నిర్వహించలేక ఇబ్బంది పడతారు. వారు దీర్ఘకాలిక ఒత్తిడికి గురైనప్పుడు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడతారు. అధిక రక్తపోటు, గుండెకు రక్త ప్రవాహం సరిగా జరగకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల కూడా గుండె సమస్యలు వస్తాయి. జన్యుశాస్త్రం ప్రకారం కూడా పురుషుల్లో విసెరల్ కొవ్వు అంటే అవయవాలు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే చర్మం కింద కొవ్వు ఉండడం కూడా పురుషుల్లోనే అధికంగా ఉంటుంది. దీనివల్లే వారికి రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటివి త్వరగా వస్తాయి. పురుషులు చిన్న వయసులోనే గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మహిళల్లో మెనోపాజ్ దాటిన తర్వాత గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది.
గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే పురుషులు పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. వ్యాయామం చేయాలి. బరువును పెంచుకోకూడదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వారి గుండె ఆరోగ్యంగా ఉండదు.


Related News

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Heart Disease: మహిళలకు గుండె జబ్బులు తక్కువ వస్తాయి ?.. ఎందుకో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

Type 1 Diabetes: అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

Dandruff: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Eyelash: ఆకర్షణీయమైన కనురెప్పల కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Rock Salt: రాక్ సాల్ట్‌తో జీర్ణ సమస్యలు దూరం.. మరెన్నో ప్రయోజనాలు

Health Tips: ఈ 5 అలవాట్లతో అనారోగ్య సమస్యలు రావు

Big Stories

×