Big Stories

Kids Obesity from Mothers: తల్లి నుంచి ఆడ పిల్లలకు అతి బరువు ముప్పు..

Obesity

- Advertisement -

Overweight threat from Mother To Girl Child: తల్లి ఊబకాయంతో బాధడుతుంటే.. ఆమెకు జన్మించే ఆడపిల్లలు కూడా అతి బరువు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యనంలో తేలింది. ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండో క్రైనాలజీ అండ్ మెటబాలిజం జరిపిన అధ్యయనంలో ఈ ఫలితం వచ్చింది. ఇలా జన్మించిన తొమ్మిది ఏళ్ల లోపు చిన్నారుల శరీరంలోని , కొవ్వు, కండరాలను పరీక్షించగా అవి తమ తల్లిలాగే జీఎంబీ, ఫ్యాట్ మాస్ కలిగి ఉన్నారని అధ్యయనంలో తేలింది. మగ సంతానానికి ఈ ముప్పు ఉన్నట్లు వెల్లడి కాలేదు.

- Advertisement -

ఇలా జరగడానికి గల కారణాలను విశ్లేషించేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే ఆడ సంతానం శరీర బరువు విషయంలో చిన్న వయసులోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు.

అందరిలోను ఇలా జరగకపోవచ్చను పరిశోధకులు తెలిపారు. అంతే కాకుండా ఊబకాయం వల్ల గర్భిణీలో మృత శిశు జననాలకు ముప్పు పెరుగుతుందని కెనడాలోని డలౌసి యూనివర్శిటి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ముఖ్యంగా నెలలు నిండే సమయలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. ఊబకాయం ఉన్న మహిళలకు కాన్పు త్వరగా జరిగితే ఈ ముప్పు తగ్గొచ్చని వివరించింది.

Also Read: మీరు నిమిషానికి ఎన్నిసార్లు కళ్లు ఆర్పుతున్నారు?

అధ్యయనంలో భాగంగా 2012 నుంచి 2018 మధ్య 1956 మృత శిశు జననాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. అధిక బరువుతో బాధ పడుతున్న గర్బిణీలకు 40 వారాల సమయంలో మృత శిశిు జనన ముప్పు అధికమని గుర్తించారు. అందుకే ఊబకాయంతో బాధపడే గర్బిణీలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం, నెలలు నిండే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండటం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News