Big Stories

Summer Pregnancy Care: ఎండలో పనిచేస్తే గర్భం పోతుందా..? అసలు నిజం ఇదే!

Pregnancy Care In Summer
Pregnancy Care in Summer

Pregnancy Care Tips in Summer: పెళ్లాయ్యాక ప్రతి ఒక్కరూ ఆనందపడే మొదటి క్షణం భార్య గర్భం దాల్చడం. మన వంశంలో మరో వ్యక్తి రాబోతున్నారనే వార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలని అనేక జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయితే ఇప్పుడు ఎండకాలం కాబట్టి గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే డీహెడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంది. శరీరంలో నీటి స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గర్భస్రావం, ప్రసవ సమయంలో బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

- Advertisement -

ఎండలు, అధిక వేడి వల్ల గర్భిణులుకు మరింత ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. దీని ముప్పు భారత్‌తో పోలిస్తే బ్రిటన్ వంటి దేశాల్లో అధికంగా ఉందని అంటున్నారు. తల్లి కావాలని ఆరాటపడే మహిళలు ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలి. ఎండల్లో పనిచేసే మహిళలు వైద్యుని సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బృందం 2017 సంవత్సరంలో 800 మంది గర్భిణులపై అధ్యయనాలు చేశారు. ఈ మహిళల్లో 400 మంది ఎండలో పనులు చేసేవారే. వీరు వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఉప్పు తయారీ వంటి పనులకు వెళ్తారు. మిగిలిన సగం మంది స్కూల్స్, హాస్పిటల్స్‌లో పని చేస్తారు.

Also Read: మందులో నీళ్లు కలపాలా.. సోడా కలపాలా మామ?

భారత్ వాతావరణ మార్పులకు లోనవుతున్న దేశాల్లో ముందు వరుసలో ఉంది. పారిశ్రామికీకరణ జరగక ముందు సమయంతో పోలిస్తే.. ఇప్పటికీ భూమి సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీల మేర పెరిగిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. దీనివల్ల గర్భిణులు కొన్ని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. తీవ్రమైన వేడి గాలుల వల్ల నెలలు నిండక ముందే ప్రసవాలు జరుగే అదకాశం ఉంది. ప్రస్తుతానికి వేడి ప్రదేశాల్లో పనిచేసే గర్భిణులను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. వేడి ప్రదేశాల్లో పనిచేసే గర్భిణులు వారి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూడండి.

  • వేడి వాతావరణంలో ఉండకుండా చూసుకోవాలి.
  • వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నిర్ణీత సమయాల్లో మాత్రమే పనిచేయాలి.
  • పని సమయంలో శరీరానికి కొంత విరామం ఇవ్వాలి.
  • గర్భిణులు ఎక్కువగా నీరు తాగాలి. మీరు తాగే నీరే మీ పిండానికి కూడా అవసరం.
  • ముఖాన్ని పలుచని క్లాత్‌తో కవర్ చేయాలి.

Also Read: మీరు నిమిషానికి ఎన్నిసార్లు కళ్లు ఆర్పుతున్నారు?

ఎండలో లేదా వేడి వాతావరణంలో పనిచేసే గర్భిణులు, గర్భంలో పెరుగుతున్న పిండంపై ఎలా ప్రభావం చూపుతుందో పరిశోధకులకు స్పష్టత రాలేదు. కానీ గతంలో గాంబియాలో నిర్వహించిన పరిశోధనల్లో అధిక ఉష్ణోగ్రతలు పిండం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. బొడ్డు నుంచి పిండానికి జరిగే రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తాయని నిర్ధారించారు. తల్లి శరీరం ఎక్కువ వేడిగా ఉంటే గనుక.. ఆ ప్రభావం పిండంపై పడుతుంది. మహిళలపై సూర్యుని ప్రభావం పడటానికి మరుగుదొడ్లు లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జనకు ఇష్టపడని మహిళలు తక్కువగా నీరు తాగుతున్నారు. ఫలితంగా వారిలో మూత్రసంబంధిత సమస్యలు వస్తున్నాయి.

Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News