Diabetes Day 2024: ప్రస్తుత కాలంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిచోటా మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, పని గంటలు, ఒత్తిడి, జంక్ ఫుడ్ వంటి అలవాట్ల వల్ల మధుమేహం కేసులు పెరుగుతున్నాయి.
సకాలంలో మధుమేహాన్ని గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే వ్యాధిని గుర్తించకపోవడం వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మధుమేహం గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిని పెంచే వ్యాధి. ఇది కాలక్రమేణా గుండె, కళ్ళు , మూత్రపిండాలకు తీవ్రమైన హాని కలిగిస్తుంది.
మధుమేహం రెండు రకాలు:
వీటిలో అత్యంత సాధారణమైనది టైప్ 2 డయాబెటిస్.ఇది ముఖ్యంగా యువ తరంలో కనిపిస్తుంది.టైప్ – 2 డయాబెటిస్ ఉన్న వారిలో శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు.టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారిలో శరీరం స్వయంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని తీవ్రమైన పరిస్థితికి చేరుకుంటుంది. వీరికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా మాత్రమే చికిత్స చేయవచ్చు.
ప్రతి సంవత్సరం మధుమేహం కోసం పరీక్షలు చేయించుకోండి:
మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలితో పాటు మరికొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. బాల్యంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల, ఊబకాయం వేగంగా పెరుగుతుంది. ఇది క్రమంగా మధుమేహానికి దారితీస్తుంది. జంక్ ఫుడ్ కూడా మధుమేహానికి కారణం అవుతుంది. 30 ఏళ్లు పైబడిన వారు ఏడాదికి రెండు సార్లు మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రారంభంలోనే వ్యాధిని గుర్తించవచ్చు.
మధుమేహం లక్షణాలు ఇవే:
తరచుగా మూత్రవిసర్జన.
అధికంగా దాహం వేయడం.
తరచుగా ఆకలి వేయడం.
అలసిపోవడం.
గాయాలు నయం కాకపోవడం.
చేతులు, కాళ్ళలో జలదరింపు
మధుమేహం నివారణ చిట్కాలు:
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధిని నివారించాలనుకుంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆయిల్ మసాలా దినుసులు అలాగే స్వీట్లకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా మీ ఆహారంలో ఎక్కువ ఆకుపచ్చ కూరగాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.
వ్యాయామం: మధుమేహాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయండి.
ఒత్తిడి తీసుకోవద్దు: మధుమేహానికి అతి పెద్ద శత్రువు ఒత్తిడి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు తప్పకుండా ధ్యానం చేయండి. ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి. విశ్రాంతినిచ్చే సంగీతాన్ని వినండి.
Also Read: చలికాలంలో వాల్‌నట్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ధూమపానం, ఆల్కహాల్, కెఫిన్‌లను నివారించండి: మీరు ఎంత ఎక్కువ సిగరెట్‌లు తాగితే, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. మీకు ఏ రకమైన మధుమేహం ఉన్నా, ధూమపానం మీ మధుమేహాన్ని పెంచుతుంది.
రెగ్యులర్ చెకప్‌లను పొందండి: మీరు ఎప్పటికప్పుడు డయాబెటీస్ టెస్టులు చేయించుకోవాలి. దీంతో వ్యాధిని సకాలంలో గుర్తించిచికిత్స చేయించుకోవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.