Big Stories

Mangoes: తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టండి.. లేదంటే ప్రమాదంలో పడతారు !

Soak Mangoes In Water Before Eating: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ కోసం ఏడాదంతా మామిడి ప్రియులు ఎదురు చూస్తూ ఉంటారు. మామిడి ప్రియులను ఆపడం ఎవరి వల్ల కాదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ మామిడి పండ్లను తినడానికి ఇష్టపడుతారు. బంగినపల్లి, రసాలు, తోతాపురి అంటూ మామిడి రకాలు పస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. కానీ మామిడి పండ్లను తినేముందు కచ్చితంగా నీటిలో నానబెట్టాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడతారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మామిడిపండ్లను నీటిలో నానబెట్టినప్పుడు వాటి నుంచి ఫైటిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఒకవేళ మామిడిపండ్లను కడగకుండా తింటే ఆ యాసిడ్ మన కడుపులోకి చేరి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మామిడిపండ్లలో ఉండే ఈ ఫైటిక్ యాసిడ్‌ను యాంటీ న్యూట్రియంట్ అంటారు. ఈ యాసిడ్ కాల్షియం, ఐరన్, జింక్ ఖనిజాలను శరీరంలో కరగకుండా నిరోధిస్తుంది. మామిడి పండ్లను తినడానికి ముందు కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.

- Advertisement -

Also Read: పిల్లలను ఏసీ, కూలర్ల ముందు పడుకోబెట్టడం చాలా ప్రమాదం

కొన్ని ప్రాంతాల్లో మామిడి కాయలను మగ్గించడానికి కార్బైడ్ ఉపయోగిస్తారు. ఇది మన శరీరానికి ఎంత గానో హాని కలిగిస్తుంది. పండ్లను కడగకుండా తినడం వల్ల ఇది శరీరంలోకి చేరి తలనొప్పి, మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ రసాయనం వల్ల చర్మం, కళ్ళు, ఛాతిలో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే మామిడి పండును తినే ముందు కాసేపు నీటిలో నానబెట్టాలి. నీటిలో నానబెట్టకుండా తింటే కడుపునొప్పి, వాంతులు, ముఖంపై మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంది.

సీజనల్ ఫ్రూట్ అయిన మామిడి పండ్లు కచ్చితంగా తినాలి. ఇవి వేసవి కాలంలో వచ్చే రోగాల నుంచి కాపాడతాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. మహిళలు, పిల్లలు మామిడి పండ్లను తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది. ఇవి సులువుగా జీర్ణమవుతాయి కూడా.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News