Brass Vessel: టీ అంటే నచ్చని వారు ఎవరు ఉండరు. రోజుకు 5 నుంచి 10 సార్లు అయినా టీ తాగేస్తుంటారు. ఆహారం తీసుకోకుండా టీతోనే రోజును గడిపేసే వారు కూడా ఉంటారు. అయితే టీని సాధారణంగా తయారుచేసుకుని తాగితే ప్రయోజనాలు ఉంటాయి. కానీ అదే ఇత్తడి వాటిలో తయారుచేసుకుని తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇత్తడి పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల చికిత్స కోసం ఇత్తడి పాత్రలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇత్తడి పాత్రల్లో జింక్ ఉండడం వల్ల శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసేందుకు కూడా సహాయపడుతుంది.
ఇంట్లో ఇనుము, మట్టి, ఇత్తడి వంటి పాత్రల్లో వంట చేసుకుని తింటుంటాం. ప్రస్తుతం అయితే నాన్ స్టిక్ అంటూ చాలా రకాల పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా ఇత్తడి, రాగి, మట్టి పాత్రలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇక స్టీల్ పాత్రల్లో కూడా వంటలు చేస్తుంటాం. అయితే టీని తయారుచేసుకునే సమయంలో ఎక్కువగా స్టీల్ పాత్రలను ఉపయోగిస్తుంటారు. కానీ స్టీల్ పాత్రల కంటే టీని తయారుచేసుకోవడానికి ఇత్తడి పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
టీని తయారు చేసుకునే సమయంలో ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఏవైనా వ్యాధులు వంటివి సోకినా కూడా త్వరగా నయం అవుతాయి. మరోవైపు ఇత్తడి పాత్రల్లో ఉండే మెలనిన్ వల్ల టీ, పాలు వంటివి తయారుచేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇత్తడిలో ఉండే జింక్ కారణంగా రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఇత్తడి పాత్రల్లో వంట చేసుకుని తినడం వల్ల రుచితో పాటు 90 శాతం మేరకు పోషకాలు శరీరానికి అందుతాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)