BigTV English
Advertisement

Watermelon Benefits : పుచ్చకాయతో ఈ వ్యాధులు మాయం..!

Watermelon Benefits : పుచ్చకాయతో ఈ వ్యాధులు మాయం..!

Health Benefits of Watermelon: వేసవిలో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా దొరుగుతాయి. అందులో పుచ్చకాయ కూడా ఒకటి. ఈ పండు తినడానికి చాలా రుచిగా, జ్యూసీగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంలో సహాచయపడుతుంది. పుచ్చకాయ కలర్, రుచి పిల్లలను ఆకర్షిస్తుంది. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడని వారు ఉండరు. ఈ పండు కేవలం రుచికే పరిమితం కాలేదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పుచ్చకాయ అనేక రంగుల్లో లభిస్తుంది. రంగుకి ప్రయోజనాలకు ఎటుంటి సంబంధం ఉండదు. ఏ రంగైన ఒకే రకమైన లాభాలు ఉంటాయి.


ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటు లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ మూలకాలన్నీ కలిసి శరీరంలో నీటి కొరతను తీరుస్తాయి. అంతేకాకుండా  చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది కాకుండా పుచ్చకాయలో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా వ్యక్తి అంతర్గత రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

Watermelon Benefits
Watermelon Benefits

Also Read: మీ కళ్లలో ఒక లోతైన రహస్యం దాగి ఉంది.. అదేంటో తెలుసా?


డయాబెటిస్‌తో బాధపడేవారు పుచ్చకాయ అద్భుతమైన ఆహారంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు అలానే ప్రత్యేక యాంటీ డయాబెటిక్ లక్షణాలు నిండుగా ఉంటాయి. ఈ పండులో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు. దీని కారణంగా టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ వినియోగం ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.

ఉదర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పుచ్చకాయలో సమృద్ధిగా నీరు ఉంటుంది. ఇది వేసవిలో నీటి కొరత నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అలాగే వెన్నునొప్పి, మైకము, నోరు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం, అతిసారం, గ్యాస్ వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు.

Also Read: ఏసీ వాడుతున్నారా.. అయితే టెంపరేచర్ ఎంత ఉండాలంటే!

పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు ఉన్నందున ఇందులో తక్కువ కేలరీల కంటెంట్‌న కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అదనపు క్యాలరీలను బర్న్ చేయడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×