BigTV English

Weight Loss Food in 30 Days: 30 రోజుల్లో బరువు తగ్గించే ఆహారాలు.. వీటిని తినండి!

Weight Loss Food in 30 Days: 30 రోజుల్లో బరువు తగ్గించే ఆహారాలు.. వీటిని తినండి!


weight loss tips

30 Days Weight Loss Plan: చాలా మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు. ఇది నేటి ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా తయారైంది. వయసుతో సంబంధం లేకుండా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయాత్నాలు చేస్తున్నారు. డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు. బరువు తగ్గడానికి జిమ్, ఆహార నియంత్రణ, కొన్ని సింథటిక్ చికిత్సలు వంటివి చేయొచ్చు.

కానీ వీటితో పాటుగా మీరు తినే ఆహారంలో చిన్నిచిన్న మార్పులు చేసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. 30 రోజుల్లోనే ఆ రిజల్ట్ మీకు కడనబడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడే ఆహారం ఏంటో చూద్దాం.


బరువు తగ్గడానికి గుడ్లు, బెల్ పెప్పర్ చాలా మంచి ఆహారం. గుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. బెల్ పెప్పర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒకటి మీ జీవ క్రియను పెంచితే.. మరొకటి శరీరంలోని కొవ్వులను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

Read More: జిమ్ తర్వాత.. వీటిని టచ్ చేయకండి..!

బీన్స్, మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లు మీ జిర్ణక్రియను నెమ్మదిస్తాయి. నెమ్మదియడం అంటే మీరు తదుపరి భోజనం మెల్లగా తింటారు. అంటే ఆకలి త్వరగా వేయదు. బీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు ఆకలి అనిపించకుండా చేస్తుంది. ఫలితంగా ఆహారం అతిగా తినరు.

డ్రైఫ్రూట్స్.. వీటిని తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ బరువు తగ్గాలంటే.. బాదం, పిస్తా రెండు కలిపి తినాలి. ఒక అధ్యయనంలో కూడా ఇదే తేలింది. ఈ కాంబినేషన్ వల్ల బరువు త్వరగా తగ్గుతారు. వీటిని ఎక్కువ కూడా తినకూడదు. ఎందుకంటే డ్రైఫూట్స్ అధిక కేలరీలతో నిండి ఉంటాయి. జిమ్‌కి వెళ్లే ముందు కొన్ని గింజలు తినండి. మీరు ఎనర్జిటిక్‌గా ఉండటమే కాకుండా ఇవి మీ జీర్ణక్రియను కూడా పెంచుతాయి.

పుచ్చకాయ, యాపిల్ కలిపి తింటే శరీరంలోని చెడు కొవ్వు సులభంగా కరుగుతుంది. పచ్చకాయ లిపిడ్ ప్రొపైల్‌ను మెరుగుపరుస్తుంది. కొవ్వు పెరగడాన్ని అడ్డుకుంటుంది. యాపిల్ మీ శరీరంలో విసెరల్ కొవ్వును తగ్గిస్తుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల బరువు తగ్గుతారు.

Read More: దిండుకు గుడ్‌బై చెప్పు..!

బరువు తగ్గాలంటే వోట్మీల్ అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బెర్రీలో ఉండే రసాయనాలు శరీరంలో కొవ్వు పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. బరువు తగ్గడానికి ఈ కాంబినేషన్ ట్రై చేయండి.

పెరుగు, దాల్చిన చెక్క కలిపి తీసుకున్నా.. బరువు తగ్గడంలో మంచి ప్రయోజనం ఉంటుంది. దాల్చిన చెక్క శరీరంలోని మొత్తం కొవ్వును కరిగిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శారీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Disclaimer : ఈ కథనం కేవలం వైద్యుల సలహా మేరకు రూపొందించింది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×